వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వరుసగా వైసీకి, జగన్ ప్రభుత్వానికి షాక్ ఇస్తుంటే.. ఇప్పుడు ఆయనకు షాక్ తగిలినట్టయింది. రఘురామ తనపై మోపిన రాజద్రోహం కేసును రద్దు చేయాలని కోరుతూ అందరికీ లేఖలు రాస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఇప్పుడు రఘురామకు ఓ సవాల్ ఎదురైంది. తనను ఆర్మీ ఆస్పత్రి నుంచి త్వరగా డిశ్చార్జి చేసే విధంగా ఆ ఆస్పత్రి రిజిస్ట్రార్ కేపీరెడ్డితో కలిసి టీటీడీ జేఈవో, అలాగే గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డి ధర్మారెడ్డి కుట్ర చేశారని రాజ్‌నాథ్‌సింగ్ కు రఘురామ ఫిర్యాదు చేసి, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
అయితే ఇప్పటి వరకు ఎంపీ చేసినా ఆరోపణలపై ఆర్మీ ఆస్పత్రి రిజిస్ట్రార్ కేపీ రెడ్డి స్పందించలేదు. అలాగే గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డి కూడా దీనిపై ఎలాంటి వివరణ ఇచ్చుకోలేదు. కానీ ఇప్పుడు టీటీడీ జేఈవో ధర్మారెడ్డి మాత్రం ఘాటుగా స్పందించారు.
ఎంపీ చెప్పిన మే 3 నుంచి 18 తేదీల మధ్య తాను తిరుమలలోనే ఉన్నానని, హైరదాబాద్‌కు వెళ్లలేదని ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ఎంపీ రఘురామ చేసిన కుట్ర ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని వెల్లడించారు. కేపీ రెడ్డి ఎవరో కూడా తనకు తెలియదని రాజకీయా లబ్ధి కోసమే ఎంపీ ఈ ఆరోపణలు చేశారన్నారు. రఘురామ చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే తాన టీటీడీ జేఈవో ఉద్యోగానికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. కావాలంటే తన ఫోన్ నెంబర్ కు సంబంధించిన గత మూడేళ్ల కాల్ డేటాను కూడా చెక్ చేస్తే తెలుస్తుందన్నారు. అయితే ఎంపీ రఘురామ ఈసవాల్‌పై స్పందిస్తారా లేదా చూడాలి.