కాంగ్రెస్‌లో కలహాలు షురూ..రాహుల్ సీరియస్..వేటు తప్పదా?

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు జరగకపోతే ఆశ్చర్యపోవాలి గాని…పోరు జరిగితే ఆశ్చర్యం అవసరం లేదనే చెప్పాలి. అసలు అంతర్గతం అనడం కంటే బహిరంగంగానే కాంగ్రెస్ లో రచ్చ జరుగుతూ ఉంటుంది. మొన్నటివరకు అదే జరుగుతూ వచ్చింది. నేతల మధ్య సఖ్యత లేదు. ఎవరికి వారే విభేదాలు నడిచాయి. అయితే కర్నాటక ఎన్నికల్లో గెలవడంతో తెలంగాణలో కాంగ్రెస్‌కు ఊపు వచ్చింది.

అదే సమయంలో ఆ పార్టీలోకి వలసలు పెద్ద ఎత్తున మొదలయ్యాయి..బి‌జే‌పిని వెనక్కి నెట్టి బి‌ఆర్‌ఎస్ తో ఢీ అంటే ఢీ అనేలా కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తుంది. ఇలాంటి పరిస్తితుల్లో నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తే…కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు పెరుగుతాయి. కానీ కాంగ్రెస్ నేతలు అలా చేయడం లేదు. మళ్ళీ పోరు మొదలుపెట్టారు ఇప్పటికే రేవంత్, ఉత్తమ్ ల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఉత్తమ్ పార్టీ మారుతున్నారని రేవంత్ వర్గం ప్రచారం చేస్తుందని…ఉత్తమ్ వర్గం మండిపడుతుంది. అలాగే పార్టీల చేరికల విషయంలో తనతో చర్చించలేదని ఉత్తమ్ అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది.

అటు జగ్గారెడ్డి సైతం అదే అంశంపై అసంతృప్తిగా ఉన్నారు..తాజాగా ఢిల్లీకి వెళ్లినప్పుడు రాహుల్ గాంధీతో ఏకాంతంగా మాట్లాడి..కొందరు నేతలపై ఫిర్యాదులు చేసినట్లు సమాచారం..ఇక వీరే కాదు.. నియోజకవర్గాల స్థాయిలో కూడా రచ్చ మొదలైంది. పొంగులేటి కాంగ్రెస్ లో చేరడంతో ఖమ్మంలో ఏ కాంగ్రెస్ నేత సీటుకు ఎసరు వస్తుందో తెలియడం లేదు. అటు జూపల్లి రాకతో కొల్లాపూర్ కాంగ్రెస్ లో రచ్చ మొదలైంది. ఇటు వరంగల్ పశ్చిమలో నాయిని రాజేందర్ రెడ్డి, జంగా రాఘవరెడ్డిల మధ్య రచ్చ నడుస్తుంది.

సూర్యాపేటలో దామోదర్ రెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డి వర్గాలకు పడటం లేదు. ఇలా గెలుపు అవకాశాలు ఉన్నప్పుడూ కూడా కాంగ్రెస్ నేతలు రచ్చకు దిగి..పార్టీని ఇబ్బందుల్లోకి నేడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ కే నష్టం. అయితే పార్టీలో రచ్చ చేసే నేతలపై రాహుల్ ఫోకస్ చేసినట్లు తెలిసింది. ఇంకా తప్పదు అనుకుంటే వారిపై వేటు వేయడానికి కూడా వెనుకాడకూడదని రాహుల్ భావిస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news