తెలుగుదేశం పార్టీలో మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నెక్స్ట్ ఎన్నికల్లో తాను పోటీ చేయనని, తన వారసుడుకు సీటు అడుగుతున్నానని, చంద్రబాబు ఏ సీటు ఇస్తే అక్కడ తన కుమారుడు పోటీ చేస్తాడని రాయపాటి చెప్పుకొచ్చారు. అయితే తన వారసుడు వరకు చెబితే బాగానే ఉండేది గాని..రాయపాటి తాడికొండ సీటుపై కూడా కామెంట్ చేశారు. తాడికొండ టీడీపీ సీటు తోకల రాజవర్దన్ రావుకేనని, తాడికొండ నుంచి ఎమ్మెల్యేగా ఆయన గెలుస్తారని చెప్పుకొచ్చారు.
ఇలా తాడికొండ సీటు విషయంలో కామెంట్ చేయడంతో అసలు ట్విస్ట్ వచ్చింది. ఎందుకంటే తాడికొండ సీటులో తెనాలి శ్రావణ్ కుమార్ ఉన్నారు. 2014 ఎన్నికల్లో గెలిచిన ఈయన..2019 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో వైసీపీ తరుపున ఉండవల్లి శ్రీదేవి గెలిచారు. గెలిచిన తక్కువ కాలంలోనే ఈమె ప్రజా వ్యతిరేకత తెచ్చుకున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో ఈమె గెలుపు కష్టమే అని సర్వేలు వస్తున్నాయి. అందుకే ఆ సీటుని వేరే వాళ్ళకు ఇవ్వడానికి జగన్ ప్లాన్ చేశారు. అయితే ఎవరు నిలబడిన అమరావతిలో ఉన్న తాడికొండలో వైసీపీ గెలుపు కష్టమయ్యేలా ఉంది. ఇక్కడ టీడీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అయితే ఎవరు నిలబడిన గెలిచే ఛాన్స్ కనిపిస్తోంది..ఇప్పటికే శ్రావణ్ పోటీకి రెడీ అవుతున్నారు. ఈ సమయంలో రాయపాటి బాంబు పేల్చారు. తోకల రాజవర్దన్ రావు తాడికొండలో పోటీ చేస్తారని చెప్పుకొచ్చారు. దీంతో టీడీపీలో కన్ఫ్యూజన్ మొదలైంది. కానీ చంద్రబాబు మాత్రం సీటు విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. ఆయన క్లారిటీ ఇస్తేనే..సీటు ఎవరికి దక్కుతుందో తెలుస్తుంది. అప్పటివరకు ఈ సీటుపై సస్పెన్స్ తప్పదు.