ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెళ్లాలని అప్పుడు మూడు రాజధానులు నిర్ణయాన్ని తీసుకోవాలని ఏపీ ప్రతిపక్ష నేత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇటీవల గత వారం రోజుల నుండి వైసిపి ప్రభుత్వానికి సవాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే.
కాగా త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అసలు చంద్రబాబు అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎందుకు గుర్తించారు అదేవిధంగా ఆ ప్రాంతంలో రైతుల దగ్గర కొన్న భూములు వాటి వివరాలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు వాళ్ల బినామీలు లెక్క మొత్తం త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీ ప్రజలకు అర్థమయ్యే రీతిలో వీడియో రూపంలో ఎల్ఈడి రూపంలో చూపించను న్నట్లు…ఆ తరువాత కుదిరితే మళ్లీ వైయస్ జగన్ ఏపీలో మళ్లీ ఎన్నికలకు వెళ్లలేక పోతే రెఫరెండం గా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాల..? అన్న దాని విషయంలో క్లారిటీ ఇవ్వనున్నట్లు ఏపీ మీడియా వర్గాల్లో మరియు అదే విధంగా వైసీపీ పార్టీలో వినబడుతున్న టాక్.
ముఖ్యంగా మూడు ప్రాంతాలలో అభివృద్ధి జరగాలని వైయస్ జగన్ తీసుకున్న వికేంద్రీకరణ అంశాన్ని ఏపీ రాష్ట్రంలో ప్రజలంతా స్వాగతిస్తున్న తరుణంలో ఎక్కువగా వైయస్ జగన్ మళ్లీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్లీ ఎన్నికలు రానున్నట్లు ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి.