క‌రోనా నుంచి కోలుకున్న సీఎం కేసీఆర్.. యాంటిజెన్ లో నెగెటివ్‌

క‌రోనా నుంచి సీఎం కేసీఆర్ కోలుకున్నారు. ఈ రోజు నిర్వహించిన టెస్టులో ఆయనకు కరోనా నెగెటివ్ గా వ‌చ్చింది. ఈ విష‌యాన్ని డాక్ట‌ర్లు వెల్ల‌డించారు. క్ర‌మ‌క్ర‌మంగా కేసీఆర్ ఆరోగ్యం మెరుగుప‌డ‌టంతో ఈ రోజు యాంటిజన్ టెస్టు నిర్వహించగా నెగెటివ్ వ‌చ్చింది. దీంతో టీఆర్ ఎస్ శ్రేణులు సంబురాలు చేస్తున్నారు. కేసీఆర్ క‌రోనా సోకిన రెండు రోజుల‌కు అస్వ‌స్థ‌త‌కు గుర‌వ‌డంతో య‌శోద ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకున్నారు.

అనంత‌రం మ‌ళ్లీ ఫామ్ హౌస్ కు వెళ్లి ఐసోలేష‌న్ ఉండి జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. నిత్యం ఆయ‌న వెంటే డాక్ట‌ర్లు ఉండి.. ప‌రీక్షించారు. ఇప్పుడు నెగెటివ్ వ‌చ్చినా.. వెంట‌నే బ‌య‌ట‌కు రాలేక‌పోవ‌చ్చ‌ని తెలుస్తోంది. ఇంకొద్ది రోజులు రెస్టు తీసుకుంటార‌ని స‌మాచారం. ఇక కేసీఆర్ తో పాటు కేటీఆర్ కు కూడా క‌రోనా వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే ఆయ‌న ఇంకా కోలుకోలేదు. ప్ర‌స్తుతం ఐసోలేష‌న్ లో ఉన్నారు.