ఆ మైనస్‌ని రేవంత్‌ ప్లస్ చేయగలరా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడుప్పుడే ఫామ్‌లోకి వస్తుంది. రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నట్లు కనిపిస్తోంది. అధికార టీఆర్ఎస్‌కు పోటీగా వస్తుంది. అటు తెలంగాణలో పికప్ అవుతున్న బీజేపీకి చెక్ పెట్టేందుకు చూస్తుంది. అయితే కాంగ్రెస్‌ని మరింతగా బలోపేతం చేయడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ముందుకెళుతున్నారు. రాష్ట్రంలో అన్నీ జిల్లాల్లో కాంగ్రెస్ నాయకులని యాక్టివ్ చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి | Revanth Reddy
రేవంత్ రెడ్డి | Revanth Reddy

అయితే మిగిలిన జిల్లాల్లో పరిస్తితి కాస్త మెరుగవుతున్నట్లు కనిపిస్తున్నా, జి‌హెచ్‌ఎం‌సి పరిధిలో మాత్రం కాంగ్రెస్‌కు బాగా మైనస్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ బాగా వీక్‌గా కనిపిస్తోంది. జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చిన స్థానాలని బట్టి చూస్తే, ఆ పార్టీ పరిస్తితి ఎలా ఉందో అర్ధమవుతుంది. ఆ పార్టీకి కేవలం మూడు కార్పొరేటర్ల బలం మాత్రమే ఉంది. అటు టీఆర్ఎస్, బీజేపీలు పోటాపోటిగా జి‌హెచ్‌ఎం‌సిలో డివిజన్లు గెలుచుకున్నాయి.

అంటే జి‌హెచ్‌ఎం‌సి పరిధిలో ఆ రెండు పార్టీలు బాగా బలంగా ఉన్నాయని చెప్పొచ్చు. మరి ఇలాంటి పరిస్తితుల్లో నెక్స్ట్ ఎన్నికల్లో సత్తా చాటాలని అనుకుంటున్న రేవంత్, ఖచ్చితంగా జి‌హెచ్‌ఎం‌సిలో పార్టీని బలోపేతం చేయాలి. లేదంటే ఆ పార్టీకి చాలా నష్టం జరుగుతుంది.

అసలు 2014 ఎన్నికల్లోనే జి‌హెచ్‌ఎం‌సి పరిధిలో కాంగ్రెస్ సీట్లు గెలుచుకోలేదు. అప్పుడు టీడీపీ-బీజేపీలు పొత్తులో మెజారిటీ సీట్లు కైవసం చేసుకున్నాయి. ఇక 2018 ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలుచుకుంది. అయితే టీడీపీతో పొత్తు ఉండటం వల్ల కాంగ్రెస్ కూడా మూడు, నాలుగు స్థానాల్లో సత్తా చాటింది. ఎందుకంటే ఇక్కడ ఏపీ ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

అయితే వారిని కాంగ్రెస్ వైపుకు తిప్పుకోవాల్సిన అవసరం రేవంత్‌కు ఉంది. అలాగే ఇక్కడ బీజేపీ బలాన్ని తగ్గించి, కాంగ్రెస్ బలాన్ని పెంచాలి. లేదంటే వచ్చే ఎన్నికల్లో జి‌హెచ్‌ఎం‌సి పరిధిలో కాంగ్రెస్‌కు భారీ నష్టం తప్పదు. మరి చూడాలి జి‌హెచ్‌ఎం‌సిలో ఉన్న మైనస్‌ని రేవంత్ ప్లస్ చేసుకుంటారేమో.