రేవంత్ వర్సెస్ సీనియర్లు..మళ్ళీ రచ్చ..!

-

కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య విభేదాలు తగ్గేలా లేవు..నిత్యం పార్టీలో ఏదొక రచ్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పి‌సి‌సి అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి…రేవంత్ వర్సెస్ సీనియర్లు అన్నట్లు రాజకీయం నడుస్తోంది. సీనియర్లు పూర్తిగా రేవంత్‌కు యాంటీగా ఉన్నారు. ఎలాగైనా రేవంత్ రెడ్డికి చెక్ పెట్టాలనే టార్గెట్ తో పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఇటు రేవంత్ సైతం సీనియర్లకు ఎప్పటికప్పుడు చెక్ పెట్టడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు.

ఇక ఈ రచ్చ వల్ల కాంగ్రెస్ ఇంకా బలహీన పడుతుంది. నేతల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ప్రత్యర్ధులు బలపడుతున్నారు. ఇప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్‌కు బలపడే ఛాన్స్ ఉన్నా సరే..ఆ ఛాన్స్‌ని కాంగ్రెస్ నేతలు యూజ్ చేసుకోవడం లేదు. ఇప్పటికే పలుమార్లు సీనియర్లు-రేవంత్ మధ్య రచ్చ జరిగింది. తాజాగా మరోసారి డి‌సి‌సి అధ్యక్షుల విషయంలో వీరి మధ్య రచ్చ మొదలైంది. వాస్తవానికి కొందరు జిల్లా అధ్యక్షులని మార్చాలని రేవంత్ మొదట్లోనే భావించారు. తాను పి‌సి‌సి అధ్యక్షుడు అయినప్పుడే కొందరిని మార్చాలని ఫిక్స్ అయ్యారు.

అలాగే దీనిపై కసరత్తు కూడా చేశారు..ఎలాగైనా సరిగ్గా పనిచేయని జిల్లా అధ్యక్షులని పక్కన పెట్టి కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలని చూశారు. కానీ కొందరు కాంగ్రెస్ సీనియర్లు ఈ కార్యక్రమాన్ని జరగనివ్వలేదు. ఇప్పుడు ఈ అంశాన్ని రేవంత్ సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే దీనిపై రాహుల్ గాంధీకి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. కేరళలో భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్‌ని రేవంత్ కలిసి..ఈ విషయంపై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాహుల్ కూడా దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

దీంతో తాజాగా రేవంత్ జిల్లా అధ్యక్షుల మార్పుపై కసరత్తు చేస్తున్నారు. అలాగే ఇప్పటికే కొందరిని తప్పిస్తున్నట్లు హింట్ కూడా ఇచ్చారట. దీంతో పదవులు పోయెవరు..పలువురు సీనియర్లని కలిసి మొర పెట్టుకుంటున్నారట. అందుకే మళ్ళీ ఈ కార్యక్రమానికి అడ్డుకట్ట వేయాలని కొందరు సీనియర్లు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సారి రేవంత్ ఆగేలా లేరు..జిల్లా అధ్యక్షులని మారితే మళ్ళీ అసంతృప్తుల గోల మొదలవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news