విశాఖలో రివర్స్..ఆ సీట్లలో కలిసిరావట్లేదా?

-

విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాన్సెప్ట్‌తో అధికార వైసీపీ ఉత్తరాంధ్రపై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. మళ్ళీ ఉత్తరాంధ్రలో సత్తా చాటాలనే ఉద్దేశంతో క్యాపిటల్ కాన్సెప్ట్‌తో ముందుకెళుతుంది. ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో మళ్ళీ ఎక్కువ సీట్లు దక్కించుకోవాలని చూస్తుంది. అయితే ఈ రాజధాని కాన్సెప్ట్ వైసీపీకి కలిసొస్తుందా? అంటే కాస్త కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి గాని..గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు రాకపోవచ్చు అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఎందుకంటే రాజధాని అని చెప్పి మూడున్నర ఏళ్ళు దాటింది..అయినా సరే రాజధాని ఏర్పాటు కాలేదు. కానీ ఈ మధ్య మాత్రం త్వరలోనే విశాఖ నుంచి జగన్ పాలన మొదలుపెడతారని చెబుతున్నారు. అంటే త్వరలోనే విశాఖ రాజధాని అవుతుందని అంటున్నారు. ఎన్నికల ముందు రాజధాని చేయడం వల్ల అక్కడి ప్రజలు వైసీపీని నమ్ముతారా? అలాగే రాజధానిని విశాఖ ప్రజలు ఎంతమేర కోరుకుంటున్నారనేది కూడా క్లారిటీ లేదు. అభివృద్ధి చేయకుండా రాజధాని పెట్టినంత మాత్రాన పెద్దగా ఉపయోగం ఉండేలా లేదు. అందుకే విశాఖలో వైసీపీకి అనుకున్న మేర మైలేజ్ వచ్చే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదని అంటున్నారు.

 

గత ఎన్నికల్లో జిల్లాలో 15సీట్లు ఉంటే వైసీపీ 11 సీట్లు గెలుచుకుంది. టీడీపీ 4 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అయితే ఈ సారి వైసీపీకి 11 సీట్లు దక్కే అవకాశాలు తక్కువ ఉన్నాయని తెలుస్తోంది. ఎలాగో విశాఖ సిటీలో వైసీపీ అనుకున్న మేర బలపడినట్లు కనిపించడం లేదు. పైగా టీడీపీ-జనసేన పొత్తు ఉంటే డౌటే లేకుండా విశాఖలో వైసీపీ లీడ్ పడిపోతుందని తెలుస్తోంది.

జిల్లాలో వైసీపీకి అనుకూలంగా కొన్ని సీట్లు మాత్రమే ఉన్నాయి. పాడేరు, అరకు, మాడుగుల లాంటి సీట్లలో రిస్క్ లేదు. కొద్దో గొప్పో చోడవరం, అనకాపల్లి లాంటి సీట్లలో బలం ఉంది. కానీ నర్సీపట్నం, భీమిలి, గాజువాక, విశాఖ సిటీలోని నాలుగు సీట్లు, పాయకరావుపేట, పెందుర్తి, ఎలమంచిలి లాంటి సీట్లలో రిస్క్ తప్పేలా లేదు. మిగిలిన సీట్లలో వైసీపీకి రిస్క్ ఎక్కువ ఉంది. పైగా టీడీపీ-జనసేనలు కలిస్తే వైసీపీకి విశాఖలో భారీ షాక్ తప్పదని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news