తెలంగాణ రాజకీయాలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో కుత కుత ఉడుకుతున్నాయి. రోజుకో కొత్త మలుపులు తిరుగుతున్నాయి.చాలా వరకు కొత్త రాజకీయా శక్తులు పుట్టుకొచ్చి రాష్ట్ర రాజకీయా్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఇక ఇప్పుడు కొత్తగా ఆర్. ప్రవీణ్ కుమార్ ఎపిసోడ్ రాజకీయాల్లో ప్రకపంనలు రేపుతోంది. ఇప్పటికే ఆయన తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేయడంతో ఆయన టీఆర్ఎస్ తరఫున హుజూరాబాద్‌లో పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
కాగా ఇలాంటి విమర్శలకు ఆయన చెక్ పెడుతూ నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో మరీ ముఖ్యంగా కేసీఆర్‌పైనే టార్గెట్గా ఆరోపణలు కూడా చేశారు. నిన్న ఆయన అధ్యక్షతన జరిగిన స్వేరోస్ సమావేశంలో ఇప్పడు జరుగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికపై కూడా మాట్లాడారు.
ఇప్పుడు మళ్లీ దళిత బంధు అంటూ మోసం చేస్తున్నారని, దళితులు మోసపోవద్దని, ఓటును అమ్ముకోవద్దని కోరారు. అలాగే ఇప్టపికే దళిత సీఎం అంటూ మోసం చేశారని, మళ్లీ మోసం చేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు తల నరుక్కుంటామని దొంగ హామీలు ఇస్తారని, అలాంటివి నమ్మొద్దని ఇన్ డైరెక్టుగా కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు ప్రవీణ్ కుమార్. దీంతో ఇప్పుడు ఆయన కేసీఆర్ కెఉ వ్యతిరేకమైన ప్లాట్ ఫామ్‌ను ఎంచుకుని రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.