రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న హుజూరాబాద్ huzurabad ఉప ఎన్నికపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. కాగా ఇప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ తరఫున ఎవరు పోటీ చేస్తారనేది ఇప్పుడు పెద్ద చర్చీనీయాంశంగా మారింది. రీసెంట్ గా కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్‌లో చేరడంతో ఇప్పుడు టికెట్ ఆయనకు ఇస్తారా లేదా ఇంకెవరికైనా ఇస్తారా అనే ప్రచారం జరుగుతోంది. కాగా ఇప్పుడు హుజూరాబాద్ ఎన్నికలపై బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలుచేశారు.
మొన్నటి వరకు ఊర్లళ్లో టీఆర్ఎస్ నియమించిన ఫీల్డ్ అసిస్టెంట్లను ఆ తర్వాత ప్రభుత్వమే రాష్ట్ర వ్యాప్తంగా 7,600మందిని తీసేసిన విషయం తెలిసిందే. కాగా వారిని విధుల్లోకి తీసుకోవాలని లేదంటే అందులో బీసీ కులాలకు చెందిన వెయ్యి మంది ఫీల్డ్ అసిస్టెంట్లను ఉప ఎన్నికల్లో బరిలోకి దిగి టీఆర్ఎస్‌ను ఓడిస్తారని సంచలన ప్రకటన చేశారు.
అంటే గతంలో నిజామాబాద్ ఎంపీ ఎన్నికల్లో రైతులు పోటీ చేస్తే కేసీఆర్ కూతురు కవిత ఓడిపోయిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఇక్కడ అదే రీతిలో ఫీల్డ్ అసిస్టెంట్లను దింపి టీఆర్ఎస్‌ను ఓడగొడుతామని ప్రకటించారు. ఇక్కడ ఇంకో ట్విస్టు ఏంటంటే ఈటల రాజేందర్ కూడా బీసీ నేత కావడంతో ఆయనకు ఇన్ డైరెక్టుగా సపోర్టు ఇచ్చే విధంగా వందలాదిగా బీసీ నాయకులు టీఆర్ఎస్ క్యాండిడేట్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని చెప్పడంతో టీఆర్ ఎస్ వర్గాల్లో కల్లోలం రేపుతోంది.