బ‌హుజ‌న నినాదంతో దూసుకుపోతున్న ప్ర‌వీణ్‌కుమార్‌.. వ‌రుస మీటింగులు

-

బ‌హుజ‌న వాదంతో త‌న‌దైన స్టైల్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్ర‌వీణ్ కుమార్ రాజ‌కీయాలోకి అడుగు పెట్టారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీల‌కు రాజ్యాధికారి రావాల‌నే త‌న ఐపీఎస్ ప‌ద‌వికి రాజీనామా చేసి ముంద‌కు సాగుతున్నారు. బ‌హుజ‌నుల హ‌క్కుల కోసం ఉద్య‌మిస్తున్న నేత‌ల‌తో భేటి అవుతున్నారు. వ‌రుసగా ఆయా వ‌ర్గాలకు త‌ర‌పున ప్ర‌తినిధ్యం వ‌హిస్తున్న వారిని క‌లిస్తూ మ‌ద్ద‌తు కుడ‌క‌డుతున్నారు. ఇటివ‌ల బీసీ సంఘం జాతీయ అధ్య‌క్షుడు ఆర్‌. కృష్ణ‌య‌ను క‌లిసి త‌న పోరాటానికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరారు. ఇద్ద‌రు స‌మావేశం కావ‌డం మీడియాలో చ‌ర్చ జ‌రుగుతుంది.

 

praveen-kumar

తీవ్రంగా గాయ‌ప‌డి ఇంట్లో చికిత్స పొందుతున్న మంద‌కృష్ణ మాదిగ‌ను ప్ర‌వీణ్ కుమార్ క‌లిశారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ద‌ళితుల స‌మ‌స్య‌ల‌పై ఇద్ద‌రు నేత‌లు చ‌ర్చించుకున్నారు. బ‌హుజ‌నుల‌కు రాజ్యాధికారం ద‌క్కాల‌నే సంక‌ల్పంతో ముందుకు సాగుతున్న త‌న‌కు ఆశ్వీర్వ‌దించాల‌ని ఆయ‌న కోరారు. మాల మ‌మ‌హానాడు జాతీయ అధ్య‌క్షుడు అద్దంకి ద‌యాక‌ర్‌తో ప్ర‌వీణ్ భేతి కావ‌డం. ఇద్ద‌రు ప్ర‌ధానంగా ద‌ళిత వ‌ర్గాల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించారు. కాంగ్రెస్ అధికార ప్ర‌తినిధిగా అద్దంకి ద‌యాక‌ర్ కొన‌సాగుతున్నారు. ఈ స‌మావేశం అనంత‌రం అద్దంకి ద‌యాక‌ర్ మీడియాతో మాట్లాడారు. తాను కాంగ్రెస్ అధికార ప్ర‌తినిధిగా ఉన్నా.. మాల మ‌హానాడు జాతీయ అధ్యక్షుడిగా ఎస్సీ వ‌ర్గాల స‌మ‌స్య‌పై ఉద్య‌మిస్తామ‌న్నారు. భ‌విష్య‌త్‌లో బ‌హుజ‌న స‌మాజ్ వాది పార్టీలో క‌లిసి ప‌ని చేసే అవ‌కాశం ఉంటుంద‌న్నారు.

ఇలా ఆర్‌.ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఆయా వ‌ర్గాల‌కు చెందిన ముఖ్య నేత‌ల‌తో స‌మావేశం కావ‌డం రాష్ట్ర రాజ‌కీయ‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అంతేకాకుండా అన్ని వ‌ర్గాల‌కు చెందిన వారితో క‌లిసి బ‌హుజ‌నుల రాజ్యాధికార‌మే ధ్యేయంగా ప‌ని చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. బ‌హుజ‌న వాదంతో ముంద‌కు సాగుతున్న ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఎంత‌వ‌ర‌కు స‌క్సెస్ అవుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news