తగ్గని షర్మిల: జగన్‌ని తగులుకున్న గులాబీ నేతలు..!

-

తెలంగాణలో ఓ వైపు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. అలాగే రాష్ట్రంలో ఈడీ, సి‌బి‌ఐ, ఐటీ దాడులతో టీఆర్ఎస్‌లో టెన్షన్ మొదలైంది. అటు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పేరు వచ్చింది..రిపోర్టులో కూడా ఆమె పేరు ఉంది. దీంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అదే సమయంలో గత మూడు రోజులుగా టీఆర్ఎస్ వర్సెస్ షర్మిల అన్నట్లు రాజకీయ యుద్ధం నడుస్తోంది.

ఇదే క్రమంలో కవిత, షర్మిల మధ్య ట్వీట్ వార్ కూడా నడిచింది. అయితే షర్మిలపై వరుసపెట్టి టీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. కాకపోతే షర్మిల..కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే..టీఆర్ఎస్ నేతలు ఏమో జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా   గవర్నర్‌ తమిళిసై తో భేటీ అయిన షర్మిల… పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. పోలీసులే నర్సంపేట పాదయాత్రలో విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. ప్రభుత్వ సర్వేల్లో వైఎస్సార్టీపీకి ఆదరణ పెరిగిందని తేలిందన్నారు.

అలాగే చెప్పుతో కొడుతా అని కేవలం ఒక మంత్రిని మాత్రమే అన్నానని చెప్పుకొచ్చారు. ఇక తాను ఏపీ నుంచి వచ్చానని అంటున్నారు..మరి కేటీఆర్‌ భార్య ఎక్కడి నుంచి వచ్చారు.. ఆంధ్రా నుంచి కాదా?. విడాకులు తీసుకోమని మేం అడుగుతున్నామా?. తాను ఇక్కడే చదివా.. ఇక్కడే పెళ్లి చేసుకున్నా.. ఇక్కడే కొడుకుని కన్నా.. నా గతం.. వర్తమానం.. భవిష్యత్‌ అంతా ఇక్కడే అని అన్నారు.

ఇక షర్మిల వ్యాఖ్యలపై టీఆర్ఎస్ విరుచుకుపడుతుంది. ఇప్పటికే తెలంగాణ ఆలస్యం అవ్వడానికి వైఎస్సార్ కారణమని టీఆర్ఎస్ మంత్రులు విమర్శించారు. ఇప్పుడు షర్మిల బదులు జగన్‌ని తగులుకుని విరుచుకుపడుతున్నారు. వైఎస్.రాజశేఖర్‌రెడ్డి తెలంగాణకు పచ్చి వ్యతిరేకి అని వినోద్ కుమార్ తెలిపారు. బీజేపీ వదిలిన కార్యకర్త షర్మిల. అమిత్ షాతో మాట్లాడిన తర్వాత పాదయాత్ర చేస్తున్నారని అన్నారు.

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అడ్డుపడి నిధులు విడుదల చేయకపోతే ఒక్కరోజైనా అడిగావా? తెలంగాణలో ఒక్క క్షణమైనా కరెంట్ పోయిందా..? అదే మీ అన్న పాలనలో కరెంట్ పరిస్థితి ఏంటి? ఏపీకి వెళ్లి పాదయాత్ర చేసుకోండి. జగన్, షర్మిల ఒక్కటా?.. లేదంటే వేరా? అర్థంకాని పరిస్థితి’’ అని కామెంట్ చేశారు. ఇలా షర్మిల బదులు జగన్‌ని గులాబీ నేతలు టార్గెట్ చేస్తున్నారు

Read more RELATED
Recommended to you

Latest news