పవన్ ప్రతిపాదనలను బీజేపీ పక్కన పెట్టనుందా..?!

-

ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుని అడుగులు వేస్తోంది జనసేన పార్టీ. గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన జనసేన బీజేపీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. భవిష్యత్ లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తోంది. సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా బీజేపీ అడుగుజాడల్లోనే పయనిస్తోంది. ఒంటరి పోరాటం చేయలేనని భావించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ వెంటనే నడుస్తున్నారు.

pawan
pawan

జనసేన.. పేరుకే సొంత పార్టీ. కానీ పూర్తి మద్దతు బీజేపీ నేతలకే తెలుపుతున్నారు. తెలంగాణ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తానని తొలుత ప్రకటించిన పవన్ మూడు రోజుల్లోనే మాట మార్చేశారు. ఆ తర్వాత రంగంలోకి దిగిన బీజేపీ నేతలు జీహెచ్ఎంసీ బరిలో నుంచి పవన్ ను తప్పించారు. దీంతో జనసైనికుల్లో ఆగ్రహం, నిరాశ నెలకొంది.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన నేతలు పవన్ ప్రకటనతో నిరాశకు గురయ్యారు. సొంత పార్టీ కార్యకర్తలే నిరసన స్వరం వినిపించారు. ఇంకా చాలదన్నట్లు బీజేపీ తమ అభ్యర్థుల తరఫున పవన్ కళ్యాణ్ ను ప్రచారం చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు బీజేపీ నాయకులతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు.

మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షడు జేడీ నడ్డాతోపాటు మరికొంత మంది కీలక నేతలతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో బీజేపీ, జనసేనలో ఏ పార్టీ అభ్యర్థిని పోటీకి దించాలనే అంశం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తన ప్రచారం గురించి చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే బీజేపీకి జీహెచ్ఎంసీకి మద్దతు ఇస్తున్న నేపథ్యంలో తిరుపతి లోక్ సభ సీటును తనకు కేటాయించాలని పవన్ వెల్లడించనున్నట్లు సమాచారం.

దుబ్బాక ఉపఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. గత ఎన్నికల్లో తిరుపతి అభ్యర్థికి కేవలం 16వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. సామాజిక సమీకరణాలు, పవన్ కళ్యాణ్ ఫాలొయింగ్ ను దృష్టిలో పెట్టుకుని లోక్ సభ సీటును కేటాయించాలని జనసేన డిమాండ్ చేస్తుంది. పవన్ ప్రతిపాదనను బీజేపీ పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీటు కేటాయిస్తారా.. లేదా మద్దతుకే పరిమితమవుతారా అనేది భేటీ అనంతం తెలియనుంది.

Read more RELATED
Recommended to you

Latest news