టార్గెట్ జగన్: పవన్ తగ్గట్లేదుగా!

-

గతంలో పవన్ కల్యాణ్ అప్పుడప్పుడు మాత్రమే రాజకీయాల్లో కనిపించేవారు…ఎక్కువగా సినిమాల్లో బిజీగా ఉంటూ…రాజకీయాల్లో తక్కువ ఉండేవారు…అయితే ఈ మధ్య ప్రత్యక్షంగాను, పరోక్షం గాను రాజకీయాల్లో యాక్టివ్ గానే ఉంటున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే…రాజకీయాల్లో దూకుడుగా ఉంటున్నారు. ఎప్పుడు ఏదొక సమస్యపైన ఆయన గళం విప్పుతూనే ఉన్నారు…అధికార వైసీపీపై విరుచుకుపడుతూనే ఉన్నారు. ఎక్కడకక్కడ సమస్యలపై పోరాటం చేస్తూ…ప్రజా సభలు నిర్వహిస్తూ…జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు.

ఒకవేళ జనంలో తిరగకపోయినా…సోషల్ మీడియా ద్వారా ఆయన..జగన్ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు…తాజాగా వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ..జగన్ ప్రభుత్వ విధానాలపై సెటైర్లు వేస్తున్నారు. ప్లీనరీ సమావేశాల్లో తనపై విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలకు పాలసీ పరమైన విమర్శలతో కౌంటర్లు ఇస్తున్నారు.

ప్లీనరీ మొదటి రోజు..పవన్ తనదైన శైలిలో నవరత్నాల గురించి సెటైర్ వేశారు. నవరత్నాల పేరిట ప్రజలకు మేలు చేస్తున్నామని జగన్ ప్రభుత్వం చెప్పుకుంటున్న సమయంలో…నవరత్నాలలో కోతలు విధించి ప్రజలకు అన్యాయం చేస్తున్నారని పవన్ ప్రశ్నిస్తున్నారు. నవరత్నాల అమలుపై నవ సందేహాలు అంటూ పోస్టు పెట్టారు. అంటే ఒక్కో స్కీమ్ గురించి చెబుతూ…జగన్ ఏం చెప్పారు..ఇప్పుడు ఏం చేస్తున్నారు..ఒక్కో పథకంలో ఎలా కోతలు విధించారనే అంశాన్ని హైలైట్ చేస్తున్నారు. ఉదాహరణకు మద్యపాన నిషేధం గురించి మాట్లాడుతూ.. మద్యం ఆదాయం 2018-19లో రూ.14 వేల కోట్లు ఉంటే… 2021-22లో రూ.22 వేల కోట్లకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు..ఇదేనా మద్యపాన నిషేధం అని నిలదీశారు.

 

ఇక తాజాగా రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్ల విలీనంపై పవన్ సెటైర్ వేశారు. ఇలా వరుసపెట్టి పవన్..జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూనే విమర్శిస్తున్నారు. అలాగే వైసీపీ చేసే తప్పులని ఎత్తిచూపుతున్నారు. మొత్తానికి పవన్ టార్గెట్ మొత్తం జగన్ మీదే పెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news