సీట్లు ఎక్స్‌చేంజ్..టీడీపీ-వైసీపీలో వింత పరిస్తితి.!

-

అవును ఏపీ రాజకీయాల్లో ప్రధాన పార్టీల్లో కొన్ని వింత పరిస్తితులు ఉన్నాయి..వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారం సొంతం చేసుకోవాలని అనుకుంటున్న రెండు పార్టీలు ఊహించని ఎత్తులతో రాజకీయం చేస్తున్నాయి. ఒకరినొకరు చెక్ పెట్టుకునేందుకు వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడలతో ముందుకెళుతున్నారు. ప్రజా మద్ధతు పొందేందుకు ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా క్రియేట్ చేసి రాజకీయ లబ్ది పొందడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇలా రకరకాల వ్యూహాలతో రెండు పార్టీలు ముందుకెళుతున్నాయి.

ఇదే క్రమంలో రెండు పార్టీలు ఊహించని విధంగా సీట్ల విషయంలో సరికొత్త ఎత్తులు వేస్తున్నారు. ఆ సీట్లు పంపకాలు చాలా వింతగా సాగేలా ఉన్నాయి. అంటే వైసీపీలో టి‌డి‌పి నేతలకు సీట్లు ఇవ్వడం, టీడీపీలో వైసీపీ నేతలకు సీట్లు ఇవ్వడం..ఇది ఓ రకమైన స్ట్రాటజీ అని చెప్పవచ్చు. ఇప్పుడు రెండు పార్టీలు అదే స్ట్రాటజీతో ముందుకెళుతున్నాయి. రాష్ట్రంలో కొన్ని స్థానాల్లో టి‌డి‌పి వీక్ గా ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా నెల్లూరు, కడప, చిత్తూరు లాంటి జిల్లాలో కొన్ని స్థానాల్లో టి‌డి‌పికి సరైన నాయకులు లేరు..అలాగే బలమైన నాయకులు లేరు.

దీంతో వైసీపీలో ఉన్న బలమైన నాయకులని టి‌డి‌పిలోకి తీసుకుని వారికి సీట్లు ఇవ్వాలని చూస్తున్నారు. ఇప్పటికే నెల్లూరులో వైసీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు బయటకొచ్చారు. వారిని టి‌డి‌పిలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంకా పలు చోట్ల టి‌డి‌పి అదే పనిలో ఉంది. ఇక వైసీపీ కూడా అదే పనిచేస్తుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. వారికి సీటు ఇస్తే వైసీపీ ఓడిపోవడం ఖాయం.

అందుకే జగన్ మళ్ళీ వాళ్ళకు సీట్లు ఇవ్వనని అంటున్నారు. అలా వీక్ గా ఉన్న ఎమ్మెల్యేలని తప్పించి..టి‌డి‌పి నుంచి బలమైన అభ్యర్ధులని లాగి వారికి సీట్లు ఇవ్వాలనేది వైసీపీ స్కెచ్..ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో అదే విధంగా ముందుకెళుతున్నారు. చూడాలి అటు ఇటు సీట్లు ఎక్స్‌చేంజ్ ఏ మేరకు అవుతాయో.

Read more RELATED
Recommended to you

Latest news