ఇయర్ ఎండింగ్‌లో వైసీపీ-టీడీపీ రాజకీయం..విధ్వంసం-బూతులు!

-

2022 సంవత్సరం ముగుస్తుంది..అయినా సరే ఏపీలో రాజకీయ పార్టీలు వెనక్కి తగ్గట్లేదు. అటు అధికార వైసీపీ-ఇటు ప్రతిపక్ష టీడీపీలు మాటల యుద్ధాన్ని మరింత ఉదృతం చేస్తూనే ఉన్నాయి. తాజాగా నెల్లూరు పర్యటనలో ఉన్న బాబు..వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతున్నామని, వైసీపీ ప్రభుత్వంలో బాదుడు, విధ్వంసాలు, వేధింపులుగా ఈ ఏడాది మిగిలిపోయిందని అన్నారు.

విధ్వంసాల ఫలితం ప్రజలు అనుభవించే పరిస్థితికి వచ్చారని, ఇదేమని ప్రశ్నిస్తే మానసిక క్షోభ, శారీరక వేధింపులు. పోలీసులతో కేసులు పెట్టించి ఇబ్బందిపెట్టారని, వైసీపీ రౌడీలు, సైకోలు ఊరికొక్కరు చొప్పున తయారయ్యారని,  మనమంతా బాధపడుతుంటే జగన్, అతని పక్కన ఉండే వారు పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. ఇక బాబు విమర్శలకు వైసీపీ సైతం వెంటనే కౌంటర్లు ఇచ్చింది.

2022  సంవత్సరం చంద్రబాబుకు బూతుల నామ సంవత్సరంగా మారిందని, చంద్రబాబు, లోకేష్, అయ్యన్నపాత్రుడు నుంచి దత్తపుత్రుడు వరకు అందరికీ ఈ ఏడాది బూతుల నామ సంవత్సరం అయిందని మంత్రి జోగి రమేష్ అన్నారు.

పేదవారికి విద్యా, వైద్య, ఆరోగ్యపరంగా విజయనామ సంవత్సరం అని,  2023లో పవన్ కళ్యాణ్, చంద్రబాబులకు పచ్చి బూతులు ఎలా తిట్టాలని ట్రైనింగ్ అయ్యే సంవత్సరంగా మారిపోతుందని ఎద్దేవా చేశారు. ఇలా రెండు పార్టీలు విమర్శలతో ఈ సంవత్సరాన్ని ముగిస్తున్నారు.

అయితే బూతులు అనేది అన్నీ పార్టీల నేతలకు కామన్ అయిపోయింది. మంత్రి జోగి రమేష్ సైతం వైసీపీలో బూతులు మాట్లాడే నేతల లిస్ట్ కూడా చెప్పి ఉంటే బాగుండేదని కౌంటర్లు వస్తున్నాయి. ఇక బాబు ఏమో విధ్వంసం జరిగిపోయింది..రాష్ట్రం నాశనం అయిపోయిందని చెప్పి..పూర్తిగా జగన్ ప్రభుత్వాన్ని నెగిటివ్ చేసేలా టార్గెట్ చేసినట్లు ఉన్నారు.

ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు దమ్ముంటే 175 నియోజకవర్గాలలో టీడీపీ అభ్యర్థులను నిలబెట్టాలని.. పవన్ కళ్యాణ్ కూడా ఈ సవాల్‌ని స్వీకరించాలని జోగి రమేష్ అంటున్నారు. అంటే టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందనే నేపథ్యంలో.ఆ పొత్తు వైసీపీకి రిస్క్ అవుతుందనే కోణంలో..ఇప్పుడు వారు విడిగా పోటీ చేసేలా రెచ్చగొడుతున్నట్లు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news