బీజేపీకి టీడీపీ కౌంటర్లు..ఒక్క సీటు గెలవలేదు..పొత్తు లేదు!

-

చాలరోజుల తర్వాత బి‌జే‌పి టార్గెట్ గా టి‌డి‌పి విరుచుకుపడటం మొదలైంది. గత ఎన్నికల ముందు బి‌జే‌పిని టి‌డి‌పి ఏ విధంగా టార్గెట్ చేసిందో తెలిసిందే. కానీ ఆ ఎన్నికల్లో రాజకీయంగా టి‌డి‌పికి భారీ దెబ్బ తగిలింది. వైసీపీ గెలుపుకు బి‌జే‌పి కూడా సహకరించింది. అటు కేంద్రంలో బి‌జే‌పి కూడా అధికారంలోకి వచ్చింది. దీంతో చంద్రబాబు సైలెంట్ అయ్యారు. ఇంకా బి‌జే‌పి జోలికి వెళ్లలేదు. బి‌జే‌పికి మళ్ళీ దగ్గరయ్యే ప్రయత్నాలే చేశారు.

కానీ ఎన్ని చేసిన బి‌జే‌పి..వైసీపీకి సపోర్ట్ చేస్తూనే ఉంది. కేంద్రం..జగన్‌కు సహకరిస్తుంది. బి‌జే‌పి-వైసీపీల మధ్య స్నేహం కొనసాగుతుంది. అదే సమయంలో పవన్‌ని టి‌డి‌పి వైపుకు వెళ్లనివ్వకుండా..తమతో పొత్తులో పోటీ చేసేలా చేసి ఓట్లు చీల్చి టి‌డి‌పికి నష్టం, వైసీపీకి లాభం చేయాలనే ప్లాన్ లో బి‌జే‌పి ఉంది. మళ్ళీ టి‌డి‌పి అధికారంలోకి రాకపోతే ఆ పార్టీని తోక్కేసి బలపడాలని బి‌జే‌పి ప్లాన్ చేస్తుంది. అందుకే టి‌డి‌పితో పొత్తుకు బి‌జే‌పి రెడీగా లేదు. ఇదే సమయంలో ఏ మాత్రం బలం లేని బి‌జే‌పితో పొత్తుకు టి‌డి‌పి కూడా రెడీగా లేదు. కాకపోతే కేంద్రంలో అధికారంలో ఉంది కదా అని, ఆ పార్టీ కోసం చూస్తున్నారు.

అయితే ఎంతైనా బి‌జే‌పి…టి‌డి‌పికి దగ్గరయ్యేలా లేదు. పైగా టి‌డి‌పిని బి‌జే‌పి నేతలు ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. 2024 తర్వాత టి‌డి‌పి ఉండదని కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో టి‌డి‌పి నేతలు కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. బి‌జే‌పి-వైసీపీ ఒక్కటే అని ప్రజలు అనుకుంటున్నారని, ప్రజలకు న్యాయం చేయని పార్టీలని ప్రజలు ఆదరించారని అచ్చెన్నాయుడు అన్నారు.

పవన్‌ని టి‌డి‌పి వైపుకు రాకుండా బి‌జే‌పి భయపెడుతుందని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ఇక తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సైతం బి‌జే‌పి టార్గెట్ గా విరుచుకుపడ్డారు.  పొత్తుల కోసం వెంపర్లాడాల్సిన అగత్యం టీడీపీకి లేదని, బి‌జే‌పికి ఒక్క సీటు గెలిచే సత్తా లేదని,  ఆ పార్టీ ఓటు బ్యాంక్ ఎంతో జీవీఎల్ నరసింహారావు చెప్పాలని ఎద్దేవా చేశారు. ఇలా టి‌డి‌పి నేతలు బి‌జే‌పికి కౌంటర్లు ఇవ్వడం బట్టి చూస్తే..ఇంకా బి‌జే‌పితో టి‌డి‌పి పొత్తు లేనట్లే అని తేలిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news