టీడీపీని పాత స్నేహాలు ఇబ్బంది పెడుతున్నాయా…?

-

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి కొంత మంది నేతలు నుంచి సహకారం లేదు అనే భావన చాలా వరకు కూడా ఉంది. కార్యకర్తలలో కూడా ఈ అంశం ఎక్కువగా హైలెట్ అవుతూ ఉంటుంది. కొంతమంది నాయకులు ప్రజల్లోకి వెళ్లడానికి అవసరమైన వనరులు ఉన్నా సరే వాటిని సమర్ధవంతంగా వాడుకునే లేని పరిస్థితిలో లేరు అనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పరిస్థితులను అంచనా వేసుకున్న చాలా మంది తెలుగుదేశం పార్టీ నేతలు ఈ మధ్యకాలంలో ప్రజల్లోకి రావడానికి భయపడుతున్నారు అనే భావన కూడా ఉంది.

మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ తిరుగులేని విజయం సాధించడంతో చాలా మంది తెలుగుదేశం పార్టీ నేతలు వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పుడు ప్రజల్లోకి రావాలని చంద్రబాబు నాయుడు ముగ్గురు ఎమ్మెల్యేలను కోరినా వారు మాత్రం ఇప్పుడు ప్రజల్లోకి రావడానికి ప్రయత్నాలు చేయటం లేదు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. దీని వెనుక ఉన్న ప్రధాన కారణం ఏంటి అనేది అర్థం కాకపోయినా సరే కొంతమంది మాత్రం ఇప్పుడు అధికారం పార్టీకి భయపడటమే కారణం అని అంటుంటే కాదు భారతీయ జనతా పార్టీ నేతల నుంచి కొన్ని వచ్చిన కొన్ని హామీలు అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

భారతీయ జనతా పార్టీ రాజ్యసభ ఎంపీలు సిఎం రమేష్, సుజనా చౌదరితో దగ్గరి సంబంధాలను కొనసాగిస్తున్న ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నారని త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయని… వచ్చే ఎన్నికల్లో పార్టీకి కూడా దూరంగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారని టిడిపి వర్గాలు అంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news