అసెంబ్లీలో టీడీపీ రచ్చ.. బాలయ్య హడావిడి..ఇదేం ఖర్మ.!

-

చంద్రబాబు అరెస్ట్ అయ్యారనే ఫ్రస్టేషన్ లో ఉన్నారో..లేక పార్టీ పరిస్తితి మరింత దిగజారిపోతుందని అనుకుంటున్నారో..అసలు జగన్‌ని ఎదురుకోవడం కష్టమని భావిస్తున్నారో తెలియదు గాని తెలుగుదేశం నేతలు ఇటీవల బాగా అదుపు తప్పుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామనే విషయం కూడా మరిచిపోతున్నారు. సి‌ఎంని సైతం దారుణంగా తిట్టడం, ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం చేస్తున్నారు. ఆఖరికి దేవాలయం లాంటి అసెంబ్లీలో సైతం దారుణమైన పరిస్తితులు క్రియేట్ చేస్తున్నారు.

తాజాగా అసెంబ్లీ సమావేశాలు మొదలవ్వగా, మొదట రోజే టి‌డి‌పి ఎమ్మెల్యేలు దారుణంగా ప్రవర్తించారు. స్పీకర్ పోడియం ఎక్కి ఆయన చుట్టూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేసి ఇబ్బంది పెట్టారు. ఇదే క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ప్రతిఘటించడంతో సీన్ మారిపోయింది. ఈ సమయంలో సినిమాలో తొడగొట్టి మీసం తిప్పే బాలయ్య..అసెంబ్లీలో మీసం తిప్పి హడావిడి చేశారు. అటు వైసీపీ నుంచి సస్పెండ్ అయిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరింత దారుణంగా ప్రవర్తించారు.  శ్రీధర్ రెడ్డి ఏకంగా పోడియం మీదకు ఎక్కి పేపర్లు లాగేసి.. మానిటర్ సైతం లాక్కునేందుకు యత్నించడం దారుణమైన విషయం.

అసలు టి‌డి‌పి ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున అసెంబ్లీలో రచ్చ సృష్టించారు. అయినా టి‌డి‌పి ఎమ్మెల్యేలు 15 మంది కూడా సరిగ్గా లేరు. కానీ గలాటా చేశారు. అదే సమయంలో 151 మంది ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు సమన్వయం పాటించారు కాబట్టి సరిపోయింది..లేదంటే ఎలాంటి పరిస్తితులు ఉండేవో ఆలోచించడానికే కష్టమని చెప్పవచ్చు.

అయితే స్కిల్ స్కామ్ కేసులో కోట్ల అక్రమాలపై జైలుకెళ్లిన బాబు డైరక్షన్ లోనే ఇదంతా జరిగినట్లు కనబడుతోంది. ఇటీవలే యనమల రామకృష్ణుడు, బాలయ్య ములాఖత్ లో బాబుని కలిశారు. అక్కడ బాబు చెప్పినట్లుగా టి‌డి‌పి ఎమ్మెల్యేలు ఇప్పుడు అసెంబ్లీలో రచ్చ చేసి..సానుభూతి పొందడానికి ప్రయత్నించారని చెప్పవచ్చు. కానీ ఎన్ని చేసిన జనాలకు అన్నీ తెలుసు. కాబట్టి ఇదంతా టి‌డి‌పికే మైనస్.

Read more RELATED
Recommended to you

Exit mobile version