బాబుకు కళ్యాణ్ ‘కాపు’.. బలయ్యేది వారే.!

జైలు వేదికగా టి‌డి‌పి-జనసేన పొత్తు ఖరారైన విషయం తెలిసిందే. స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయిన చంద్రబాబుని తాజాగా పవన్.. లోకేష్-బాలయ్యతో కలిసి కలిసిన విషయం తెలిసిందే. ఇక జైలు నుంచి బయటకొచ్చిన అనంతరం పవన్ మీడియాతో మాట్లాడి..బాబుని అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆయన్ని చూస్తే బాధేస్తుందని చెప్పుకొచ్చి..ఇక వైసీపీ అరాచక పాలనని అంతమొందించడానికి టి‌డి‌పి-జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయని ప్రకటించారు.

రాబోయే ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేన కలిసి బరిలో ఉంటాయని అన్నారు. ఇక తమతో బి‌జే‌పి కలిసొస్తుందని భావిస్తున్నానని చెప్పారు. ఒకవేళ బి‌జే‌పి కలిసిరాకపోయినా పవన్ మాత్రం..టి‌డి‌పితో కలిసే ముందుకెళ్తారు. అయితే బాబుకు కూడా కావాల్సింది ఇదే. ఎలాగో ఈ స్కామ్ లో ఇప్పుడే బెయిల్ దొరికేలా లేదు. పోనీ పార్టీని లోకేష్ నడిపించగలరా? అంటే ఆ సత్తా అసలు లేదు. ఇక బాలయ్యకు ఆ శక్తి ఉంటే..ఎప్పుడో తన తండ్రి పార్టీని తీసుకుని నడిపించేవారు. బాబు అరెస్ట్ అయినా సరే టి‌డి‌పి నేతలు పెద్దగా రోడ్డు ఎక్కలేదు.

 

టి‌డి‌పి పోరాటం సక్సెస్ కాలేదు. దీంతో బాబుకు పోరాడే మనషులు కావాలి. ఏదైనా విషయంలో పవన్ మొండిగా వెళ్తారనే సంగతి తెలిసిందే. అటు జనసేన శ్రేణులు అదే దూకుడుతో ఉంటారు. దీంతో వారి మద్ధతు దక్కుతుందని బాబు ఆశించారు. పొత్తుకు సై అన్నారు. దీని వల్ల అద్దె మనషులతో టి‌డి‌పి పోరాటం చేస్తుందనే చెప్పాలి.

అయితే ఎంతోకాలం నుంచి పవన్ సి‌ఎం అవుతారని కాపు వర్గం ఆశతో ఉంది. ముఖ్యంగా కాపు యువత పవన్ కోసం నిలబడుతుంది. కానీ పవన్ మాత్రం కాపు యువతని టి‌డి‌పికి తాకట్టు పెట్టారనే చెప్పవచ్చు. ఇప్పుడు టి‌డి‌పి కోసం కాపు యువత పోరాటం చేయాలి. ఒక వైపు జనసేన జెండా మోస్తూనే..మరోవైపు టి‌డి‌పి జెండా మోయాలి. ఇలా చేస్తే పవన్‌కు సి‌ఎం పదవి వస్తుందా? అంటే చచ్చిన రాదు. ఏదో 40 సీట్లు వరకు ఇస్తారేమో అంతే. అంటే కష్టం కాపు యువతది..అధికారం టి‌డి‌పికి. మొత్తానికి టి‌డి‌పి-జనసేన పొత్తు అని బాబు స్కామ్ డైవర్ట్ చేశారు. ఈ పొత్తులో ఇంకా బలయ్యేది కాపు యువత అనే చెప్పాలి.