కృష్ణాలో టీడీపీ క్యాండిడేట్లు చేంజ్?

-

సరిగ్గా పనిచేయని ఇంచార్జ్‌లకు సీటు ఇచ్చే ఛాన్స్ లేదని టీడీపీ అధినేత చంద్రబాబు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు పార్టీ సమావేశాల్లో బాబు ఈ విషయాన్ని తేల్చి చెప్పేశారు. తాజాగా కూడా మరోమార్పు కొందరు ఇంచార్జ్‌లని ఉద్దేశించి బాబు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఈ మధ్య వరుసపెట్టిన నియోజకవర్గాల ఇంచార్జ్‌లతో భేటీ అయ్యి..నియోజకవర్గాల్లో ఉన్న పరిస్తితులని అడిగి తెలుసుకుంటున్నారు.

అలాగే తన దగ్గర ఉన్న రిపోర్టులు ఆధారంగా నేతలకు ఇంకా ఏ ఏ అంశాల్లో గట్టిగా పనిచేయాలో సూచిస్తున్నారు. అదే సమయంలో బాగా పనిచేస్తున్న ఇంచార్జ్‌లకు బాబు సీటు ఫిక్స్ చేసేస్తున్నారు. సీటు మీదే అనే నేతలకు కన్ఫామ్ చేస్తున్నారు. కానీ కొందరు ఇంచార్జ్‌లకు ఇంకా బాగా పనిచేయాలని చెబుతున్నారు గాని…సీటు కన్ఫామ్ చేస్తున్నట్లు చెప్పడం లేదు. ఇదే క్రమంలో ఇటీవల కృష్ణా జిల్లాలో కొన్ని సీట్లని బాబు ఫిక్స్ చేసేశారు. కానీ కొందరికి సీట్లు విషయం తేల్చి చెప్పడం లేదు. అంటే వారిని బాబు మార్చే ఉద్దేశంలో ఉన్నారని తెలుస్తోంది.

జిల్లాలో ఉన్న ఏకైక సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌కు మళ్ళీ విజయవాడ ఈస్ట్ సీటు ఫిక్స్ చేశారు. మాజీ మంత్రులైన దేవినేని ఉమాకు మైలవరం, కొల్లు రవీంద్రకు మచిలీపట్నం సీటు కన్ఫామ్ అయింది. అలాగే విజయవాడ సెంట్రల్‌లో బోండా ఉమా, జగ్గయ్యపేటలో శ్రీరామ్ తాతయ్య, పెడనలో కాగిత కృష్ణప్రసాద్, అవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్, పెనమలూరులో బోడే ప్రసాద్‌లకు సీట్లు ఫిక్స్ అయ్యాయి.

కానీ గన్నవరం ఇంచార్జ్ బచ్ఛుల అర్జునుడు, కైకలూరు జయమంగళ వెంకటరమణ, నూజివీడు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, తిరువూరు దేవదత్, పామర్రులో వర్ల కుమార్ రాజా, గుడివాడలో రావి వెంకటేశ్వరరావు లకు క్లారిటీ ఇవ్వలేదు. అటు నందిగామలో తంగిరాల సౌమ్య దాదాపు మళ్ళీ పోటీ చేయొచ్చు. ఇక విజయవాడ వెస్ట్ సీటు ఇంకా ఎవరికి ఫిక్స్ చేయలేదు. జిల్లాలో 16 సీట్లు ఉంటే 9 సీట్లు ఫిక్స్…ఇంకా 7 సీట్లు ఫిక్స్ చేయలేదు. వీటిల్లో అభ్యర్ధులు మారే ఛాన్స్ ఉంది

Read more RELATED
Recommended to you

Latest news