ఏపీలో రానున్న ఎన్నిక‌ల్లో టీడీపీకి ఘోర ప‌రాజ‌యం త‌ప్ప‌దు.. మంత్రి త‌ల‌సాని..

9

ఎన్నిక‌లు వ‌స్తున్నాయ‌నే కార‌ణంతోనే చంద్ర‌బాబు ఇప్పుడు ప‌సుపు, కుంకుమ పేరుతో డ్రామాలు ఆడ‌డం మొద‌లు పెట్టార‌ని మంత్రి త‌ల‌సాని అన్నారు. ఏపీ ప్ర‌జ‌ల్ని మ‌రోసారి మోసం చేసేందుకు బాబు సిద్ధ‌మ‌వుతున్నార‌ని అన్నారు.

 

ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలుగు దేశం పార్టీ దారుణంగా ఓడిపోతుంద‌ని తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ అన్నారు. ఇవాళ ఆయ‌న సిద్దిపేట జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. రానున్న ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోతుంద‌ని అన్నారు. ఏపీ ప్ర‌జ‌లు టీడీపీ కాకుండా ప్రత్యామ్నాయ పార్టీని ఎంచుకోవాల‌ని పిలుపునిచ్చారు.

చంద్ర‌బాబు నాయుడు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయార‌ని త‌ల‌సాని అన్నారు. ఆ దెబ్బ‌కు హైద‌రాబాద్ నుంచి పారిపోయార‌ని విమ‌ర్శించారు. తెలుగువారి ఆత్మ‌గౌరవాన్ని నిల‌బెట్టేందుకు ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపిస్తే చంద్ర‌బాబు త‌న స్వ‌లాభం కోసం తెలుగు వారి ఆత్మ గౌర‌వాన్ని కాంగ్రెస్ కాళ్ల ద‌గ్గ‌ర పెట్టార‌ని ధ్వ‌జ‌మెత్తారు. మ‌రో రెండు నెలల్లో టీడీపీ ఓట‌మి ఖాయ‌మ‌ని అన్నారు. చంద్ర‌బాబుకు ఏపీలో పుట్ట‌గ‌తులు కూడా ఉండ‌వ‌ని విమ‌ర్శించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ‌లో ఉన్న ఆంధ్ర ప్ర‌జ‌ల‌ను క‌డుపులో పెట్టుకుని చూసుకుంటున్నార‌ని, అలాంటిది ఆయ‌న‌పై చంద్ర‌బాబు ఆరోప‌ణ‌లు చేయ‌డం దారుణ‌మ‌ని అన్నారు.

ఎన్నిక‌లు వ‌స్తున్నాయ‌నే కార‌ణంతోనే చంద్ర‌బాబు ఇప్పుడు ప‌సుపు, కుంకుమ పేరుతో డ్రామాలు ఆడ‌డం మొద‌లు పెట్టార‌ని మంత్రి త‌ల‌సాని అన్నారు. ఏపీ ప్ర‌జ‌ల్ని మ‌రోసారి మోసం చేసేందుకు బాబు సిద్ధ‌మ‌వుతున్నార‌ని అన్నారు. కాగా మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టాక త‌ల‌సాని తొలిసారి కొముర‌వెల్లి మ‌ల్ల‌న్న‌ను ద‌ర్శించుకున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ఆలయంలో స్వామి వారికి పూజ‌లు చేశారు.

amazon ad