కారు రూట్లో కమలం ! సూపర్ సక్సెస్ 

-

కాస్త ఆలస్యం అయినా, తెలంగాణలో బిజెపి రాజకీయంగా ముందుకు వెళ్తున్న తీరు ఆ పార్టీ రాజకీయ భవిష్యత్తు ను మరింత తీర్చిదిద్దినట్టు గా కనిపిస్తోంది. మొన్నటి వరకు నిరాశ నిస్పృహలతో ఉన్న బిజెపి కేడర్ లో ఎక్కడ లేని ఉత్సాహం కనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారం దక్కించుకోవడం  ఖాయం అనే సంకేతాలు ఆ పార్టీ కేడర్ లోనూ, ప్రజలలోను స్పష్టంగా కనిపిస్తోంది. అసలు తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా, టిఆర్ఎస్ ,కాంగ్రెస్, ఎంఐఎం వంటి పార్టీల హడావుడి ఎక్కువగా కనిపించేది . బిజెపి ఎక్కడా పెద్దగా బలం పుంజుకున్నట్టుగా కనిపించలేదు.
ఉప ఎన్నికల్లోనూ, ఆ పార్టీ ఒక్కసారిగా బలం పెంచుకోవడం వెనుక కారణాలు ఏంటి అనేది ఎవరికీ ఒకపట్టాన అర్థం కావడం లేదు. అసలు బిజెపి ఒక్కసారిగా ఈ విధంగా బలం పెంచుకోవడం , ముందుకు వెళుతున్న తీరు చూస్తుంటే సరిగ్గా టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సమయం నుంచి కెసిఆర్ ఏ ఫార్ములా అయితే ఉపయోగించారో సరిగ్గా ఇప్పుడు అదే ఫార్ములాను బిజెపి ఉపయోగిస్తున్నట్లు గా కనిపిస్తోంది.
ప్రజలలో తెలంగాణ సెంటిమెంట్ ను కేసీఆర్ ఏ విధంగా రెచ్చగొట్టి, దానిని తమ పార్టీకి బలంగా మార్చుకున్నారో ఇప్పుడు బిజెపి సైతం హిందుత్వాన్ని అదే విధంగా ప్రమోట్ చేస్తూ, బలం పెంచుకుంటున్న ట్టు గా కనిపిస్తోంది. పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ అంటూ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు చేయడం ఆషామాషీగా అయితే కాదు. దీని ద్వారా హిందుత్వం, దేశ సమగ్రత విషయంలో బీజేపీ ఎక్కడ రాజీపడదు అని, తమకు ఈ రెండే ముఖ్యమైన అంశాలు అని చాటి చెప్పుకుని హిందువులలో కదలిక తీసుకురావాలనే ధ్యేయంతోనే ముందుకు వెళ్తున్నట్టు గా కనిపిస్తోంది. అసలు టిఆర్ఎస్ పేరు చెబితే ప్రత్యేక తెలంగాణ ఏ విధంగా గుర్తుకు వస్తుందో , బిజెపి పేరు చెబితే అదే విధంగా గుర్తుకు వచ్చేలా చేయడంలో బిజెపి నాయకులు సక్సెస్ అయ్యారు. అసలు పాతబస్తీ కే పరిమితమైన ఎంఐఎం పార్టీ దేశ వ్యాప్తంగా ఇప్పుడు ప్రభావం చూపిస్తోంది.
కాశ్మీర్ ,తమిళనాడు , పశ్చిమ బెంగాల్ ఇలా అన్ని చోట్ల ప్రభావం చూపించే స్థాయికి వెళ్లింది. దేశవ్యాప్తంగా ముస్లిం లు అందరినీ ఏకం చేసి  బలం పెంచుకునే దిశగా ఎంఐఎం పార్టీ సక్సెస్ అవుతూ వస్తోంది. ప్రాంతాలకు అతీతంగా ముస్లింలంతా ఏకమవుతున్నప్పుడు హిందువులంతా ఏకమైతే తప్పేంటని హిందుత్వన్ని ప్రమోట్ చేస్తూ వస్తున్నా, బీజేపీకి మద్దతు ఇస్తే తప్పేంటి అనే అభిప్రాయం ప్రజలలోనూ కలుగుతోంది. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు సక్సెస్ అవుతూ వచ్చిందంటే , దానికి కారణం తెలంగాణ సెంటిమెంట్. ఇపుడు బిజెపి సైతం హిందూయిజం ద్వారా, తెలంగాణలో బలం పెంచుకు ని తమకు తిరుగులేకుండా చేసుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. టిఆర్ఎస్ చేయించిన సర్వేలో నే 50 నుంచి 60 సీట్లు వరకు బిజెపి దక్కించుకుంటుంది అనే రిపోర్ట్ ల వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
అదే నిజమైతే,బిజెపి మరింత కష్టపడితే గ్రేటర్ పీఠం దక్కించుకోవడం అసాధ్యమేమీ కాదు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. దీనికితోడు బిజెపి అగ్రనేతలు అంతా గ్రేటర్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే అనేక మంది కేంద్ర బిజెపి నాయకులు గ్రేటర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇలా ఎన్నో అంశాలు బీజేపీకి బాగా కలిసి వస్తున్నట్లు గా కనిపిస్తున్నాయి. టిఆర్ఎస్ చూపించిన బాటలో బీజేపీ ముందుకు వెళుతూ సూపర్ సక్సెస్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news