దేశంలో ఏ ముఖ్యమంత్రికి రాని ధాన్యం సమస్య కేసీఆర్ కే ఎందుకు వచ్చింది: రఘునందన్ రావు

-

రైతుల ధాన్యం కొనేది భారత ప్రభుత్వమే అని స్పష్టం చేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు . దేశంలో ఏ ముఖ్యమంత్రికి రాని ధాన్యం సమస్య కేసీఆర్ కే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. గల్లీలో వార్డు మెంబర్ గా గెలవని రాకేష్ టికాయత్… ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండాలని సుద్దులు చెబుతున్నారని…ఢిల్లీలో జరిగింది రైతు దీక్ష కాదని కేసీఆర్ దేశ్ కీ నేత అని హోర్డింగులు పెడుతున్నారని విమర్శించారు. వడ్లు కొనాలని ఐకేపీ సెంటర్ కు వెళ్లి ముచ్చట చెబుతావా…? లేక ఢిల్లీకి వెళ్లి దేశ్ కీ నేత అని హోర్డింగులు పెట్టించుకుంటావా..? అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు కేంద్ర మంత్రులు ఎక్కడైనా ధాన్యం కొనమని చెప్పారా..? అంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు. 2004-2021 డిసెంబర్ దాాకా ఏరోజు రాని వడ్ల పంచాయతీ ఎందుకు వచ్చింది. 28 మంది సీఎంలకు రాని వడ్ల పంచాయతీ ఒక్క కేసీఆర్ కే వడ్ల పంచాయతీ ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. రైతుల కష్టాల గురించి ఆలోచించకుండా… కేసీఆర్ రాజకీయం గురించే ఆలోచిస్తారని ప్రశ్నించారు. ఏపీ, కర్ణాటక, చత్తీస్ గడ్ లో లేని పంచాయతీ తెలంగాణలో ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. కేసీాఆర్ కు దుబ్బాక ఉప ఎన్నికల్లో అర్థం కాలేదని… హుజూరాబాద్ ఎన్నికలతో అర్థం అయిందని అన్నారు. రూ. 10 లక్షలు ఖాతాల్లో వేసినా… నీ కారుగుర్తు వద్దని ప్రజలు తిరస్కరించారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news