కేంద్రానికి కేసీఆర్‌ 24 గంటల డెడ్‌ లైన్‌..ధాన్యం కొనకపోతే భూకంపం సృష్టిస్తాం !

-

కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ 24 గంటల డెడ్‌ లైన్ ఇచ్చారు. 24 గంటలలోపు ధాన్యం సేకరణపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. దీనిపై నిర్ణయం తీసుకోకపోతే… రైతు ఉద్యమంతో.. భూకంపం సృష్టిస్తామని హెచ్చరించారు సీఎం కేసీఆర్‌. రైతు సమస్యలపై కేంద్ర ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటామని వార్నింగ్‌ ఇచ్చారు సీఎం కేసీఆర్‌. రైతుల కోసం.. దేశం లోని అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగడతామని స్పష్టం చేశారు.

పీయూష్‌ గోయల్‌ ఉల్టా పల్టా మాట్లాడుతున్నాడని నిప్పులు చెరిగారు. పీయూష్‌ గోయల్‌ కు అసలు ధాన్యం కొనుగోళ్ల పై అవగాహన ఉందా అని నిలదీశారు. మాకు ధర్నా చేయాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు.

ధాన్యం సేకరణకు దేశంలో ఒకే విధానం ఉండాలి.. ఒకే విధానం లేకపోతే రైతులు రోడ్లపైకి రావాల్సి వస్తుంది.. ఇంతదూరం వచ్చి ఆందోళన చేయడానికి కారణమెవరు? అని ఓ రేంజ్ లో రెచ్చి పోయారు సీఎం కేసీఆర్‌.తెలంగాణ రైతులు చేసిన పాపం ఏంటి..? రైతులను కన్నీరు పెట్టిస్తే, గద్దె దించే సత్తా రైతులకు ఉందని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news