తెలంగాణ : ద‌ళిత బంధు జోరందుకుందా ?

-

ఇక‌పై ల‌బ్ధిదారుల ఎంపిక అన్న‌ది గ్రామాల్లో పార‌ద‌ర్శ‌కంగా జ‌రుగుతుంది. అందుకు అంతా సిద్ధం కండి. అన‌వ‌స‌రం అయిన ఖ‌ర్చు వ‌ద్దు. అని ఆ రోజు కేసీఆర్ చెప్పిన మాట‌లే ఇప్పుడు ఆచ‌ర‌ణీయాలు.. ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో…

 

ఇత‌ర రాష్ట్రాల‌లో ఈ ప‌థ‌కం లేదు. ఇక‌పై రాదు కూడా ! ఒక్కో యూనిట్ ఏర్పాటుకు ప‌ది ల‌క్ష‌లు. తిరిగి చెల్లించ‌క్క‌ర్లేదు. కానీ డ‌బ్బులు వృథా చేస్తే మానిట‌రింగ్ ఆఫీస‌ర్ గా ఉన్న క‌లెక్ట‌ర్ అస్స‌లు ఒప్పుకోరు. ద‌ళితుల‌ను ల‌క్షాధికారుల‌ను చేయాల‌న్న స‌త్ సంక‌ల్పంతో కేసీఆర్ ప‌నిచేస్తున్నారు. ఆ విధంగా ఆయ‌న మంత్రి వ‌ర్గం సైతం అడుగులు వేస్తోంది అనేందుకు తార్కాణాలు అనేకం. మొద‌ట్లో నిధుల కేటాయింపుల‌పై అనుమానాలు ఆర్థిక వేత్త‌లు సైతం లేవ‌నెత్తారు. దీన్నొక స్కీం కాదు స్కాం అని కూడా అన్నారు విప‌క్ష నేత‌లు. కానీ అవ‌న్నీ ఒట్టి మాట‌లే అని తేలిపోయాయి.

ఎన్నిక‌ల వ‌ర‌కూ మాత్ర‌మే ఉంటుందని భావించిన ద‌ళిత బంధు ప‌థ‌కం ఇప్పుడు శ‌ర‌వేగంగా వాడ‌వాడ‌లా అమ‌లుకు సంబంధించి కార్యాచ‌ర‌ణ ఒక‌టి షురూ అవుతోంది. దీంతో కార్య‌క్ర‌మ ఉద్దేశం అన్న‌ది సానుకూల వైఖ‌రిలో భాగంగా వ్యాప్తి చెందుతూ, మంచి ప్రాచూర్యం ద‌క్కించుకుంటోంది. ఇత‌ర రాష్ట్రాలు సైతం అసూయ ప‌డేలా ఈ ప‌థ‌కం అమ‌లు ఉంద‌ని అంటోంది తెలంగాణ రాష్ట్ర స‌మితి. మొద‌ట హుజురాబాద్ ఎన్నిక‌ల నేప‌థ్యంలోనే ఈ ప‌థ‌కం ఉంటుంద‌ని అంతా భావించినా, విప‌క్షాలు కూడా అదే రీతిన ప్ర‌చారం చేసినా కూడా అవేవీ ప‌ట్టించుకోకుండా తెలంగాణ స‌ర్కారు తాను చెప్పిందే చేస్తాన‌ని నిరూప‌ణ చేసింది.
దీంతో అణ‌గారిన వ‌ర్గాల ఆనందోత్సాహాల‌కు కార‌ణం అయింది.

తెలంగాణ వాకిట ద‌ళిత బంధు ప‌థ‌కం అమ‌లులో ఇక‌పై ఎటువంటి అనుమానాలూ ఉండ‌వ‌నే అంటున్నాయి మంత్రి హ‌రీశ్ రావుతో స‌హా ఇత‌ర నాయ‌క వ‌ర్గాలు. ఇందుకు బ‌డ్జెట్ కేటాయింపులు కూడా బాగానే ఉన్నాయ‌ని చెబుతున్నాయి. దీంతో చాలా మంది అపోహల‌కు ఒక ప‌రిష్కారం దొరికంద‌న్న‌ది ఆయా వ‌ర్గాలు వెల్ల‌డి చేస్తోన్న స్పష్ట‌మ‌యిన అభిప్రాయం. ముఖ్యంగా ద‌ళితుల‌కు ప‌ది ల‌క్ష‌ల చొప్పున నిధుల కేటాయింపులో ఎటువంటి వివ‌క్షా ఉండ‌ద‌ని కూడా చెబుతున్నాయి. దేశంలోనే ద‌ళితుల‌ను ఎంత‌గానో ఆదుకున్న నంబ‌ర్ ఒన్ రాష్ట్రం తెలంగాణ అని అంటున్నాయి.

ఈ నేప‌థ్యంలో జ‌హీరాబాద్ లో హ‌రీశ్ రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌నేమ‌న్నారంటే..ఈ ఏడాదిలో నియోజక వర్గానికి 1500 మందికి దళిత బంధు ఇవ్వబోతున్నం. గౌరవంగా తలెత్తుకునేలా జీవించాలి.మాటలు మాట్లాడమంటే బిజెపి వాళ్ళవి కోటలు దాటుతాయి.దేశంలో ఉన్న 40 కోట్ల ఎస్సీ ఎస్టీ లకు కేంద్రం బడ్జెట్ లో కేవలం 12,821 కోట్లు పెట్టింది. అంటే మొత్తం బడ్జెట్ లో ఇది 0.33 శాతం. టిఆర్ఎస్ మాత్రం ఎస్సీ ఎస్టీలకు 47,350 కోట్లు కేటాయించింది. ఇది 18.43 శాతం.. అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version