మోదీ జన్‌ కీ బాత్‌ వినరు.. మన్‌ కీ బాత్‌ మాత్రమే చెబుతారు : కేటీఆర్

-

రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీపై మరోసారి విరుచుకుపడ్డారు. మోదీ జన్ కీ బాత్ వినరని.. కేవలం మన్ కీ బాత్ మాత్రమే చెబుతారని మండిపడ్డారు. 2022 వరకు అందరికీ ఇళ్లు ఇస్తామని చెప్పిన మోదీ.. రూ.435 కోట్లతో ఆయనే ఇల్లు కట్టుకుంటున్నారని విమర్శించారు. నైజీరియా కంటే  దారుణంగా భారత్‌ తయారవుతోందని నివేదికలు చెబుతున్నాయని తెలిపారు. బీజేపీ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందని.. భారత్‌ రాష్ట్ర సమితి ద్వారా అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తామని కేటీఆర్ వెల్లడించారు. దేశంలో ప్రతి ఒక్కరికీ తాగునీరు, విద్యుత్‌ ఉచితంగా అందిస్తామని ప్రకటించారు.

‘‘గోల్‌మాల్‌ గుజరాత్‌ మోడల్‌ చూపి 8 ఏళ్లలో మోదీ దేశానికి ఏం చేశారు?. గోల్‌మాల్‌ గుజరాత్‌ను ఎండగట్టడమే మా వ్యూహం. మహారాష్ట్ర, కర్ణాటకలో మాకు సానుకూలంగా ఉంది. కర్ణాటకలో కుమారస్వామితో కలిసి పోటీ చేస్తాం. కేసీఆర్‌ను అవహేళన చేసినవాళ్లంతా చీకట్లో కలిసిపోయారు. అధికారం, పదవుల కోసం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లట్లేదు. మోదీ అండ్‌ కో వ్యూహాలన్నీ మాకు తెలుసు.. వ్యూహాలను ఎదుర్కొని వారి బాగోతాలను బయటపెడతాం. తెలంగాణలో జరుగుతున్న పనిని దేశానికి చెబుతాం. ఏడాదిన్నరలో 28 రాష్ట్రాల్లో పోటీ చేస్తామని చెప్పట్లేదు’’ అని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news