తెలంగాణ ప్రభుత్వం పాలనలోకి వచ్చి ఎనిమిది సంవత్సరాలు కావస్తోంది, పాలనపై పెద్దగా వ్యతిరేకత లేకపోయినా విపక్షాలు వీరిని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం కేసీఆర్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు, తాజాగా తెలంగాణ కొత్తగా నిర్మించిన సచివాలయాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిలి సై హాజరు కాలేదని తెలిసిందే. అయితే ఎందుకు రాలేదన్న విషయం పట్ల రాష్ట్రంలో చర్చలు జరుగుతున్నాయి.
తాజాగా ఈ విషయం గురించి మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిని జీర్నించుకోలేక ఈర్ష్యతో గవర్నర్ ఈ ప్రారంభోత్సవానికి హాజరు కాలేదని అన్నారు. ఇక ఈ రాష్ట్రం అభివృద్ది పథంలో నడవడం ఎవ్వరినీ నచ్చడం లేదని అందుకే గవర్నర్ తో పాటు విపక్షాలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని ఫైర్ అయ్యారు.