మోదీ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్, జగన్ వెళ్లట్లేదు.. కారణం ఏంటో తెలుసా?

-

ఇవాళ రాత్రి ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం ఉంది. రాష్ట్రపతి భవన్ లో రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి మోదీతో దేశ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

ఇవాళ మధ్యాహ్నం 12.23 నిమిషాలకు ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అట్టహాసంగా విజయవాడలో ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్ తో పాటు పలువురు ప్రముఖులు వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు.

telugu states chief ministers delhi tour cancelled

అయితే.. జగన్ ప్రమాణ స్వీకారం అయిపోగానే.. అట్నుంచటే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఢిల్లీకి వెళ్దామనుకున్నారు. ఇవాళ రాత్రి ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం ఉంది కదా. రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి మోదీతో దేశ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అయితే మోదీ ప్రమాణ స్వీకారానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు కలిసి వెళ్దామనుకున్నారు కానీ.. వాళ్ల పర్యటన రద్దయింది.

ఢిల్లీ విమానాశ్రయంలో మధ్యాహ్నం 3.30 తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా ప్రత్యేక విమానాలను ల్యాండ్ చేయడానికి విమానాయానశాఖ అనుమతిని ఇవ్వలేదు. తెలుగు రాష్ట్రాల సీఎంలు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లాలనుకున్నారు. విమానయాన శాఖ అనుమతిని ఇవ్వకపోవడంతో వాళ్ల పర్యటన రద్దయింది.

షెడ్యూల్ ప్రకారం.. జగన్, కేసీఆర్.. మధ్యాహ్నం గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. అది క్యాన్సిల్ కావడంతో కేసీఆర్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరారు.

Read more RELATED
Recommended to you

Latest news