జ‌గ‌నన్న క్యాంప్ లో టెన్ష‌న్ టెన్ష‌న్ ?

-

మాజీలంతా ఏప్రిల్ 11 త‌రువాత ఏమౌతారో! జ‌గ‌న్ కొత్త క్యాబినెట్ లో పెద్దిరెడ్డిని కూడా కొన‌సాగించ‌క‌పోవ‌చ్చు అని కూడా అంటున్నారు. ఆయ‌న స్థానంలో అదే ఇంటికి చెందిన పెద్దిరెడ్డి ద్వార‌కానాథ్ రెడ్డి అయ్యే అవ‌కాశాలున్నాయి అని కూడా తెలుస్తోంది. ఇవి ఎలా ఉన్నా ఈ సారి బొత్స కూడా సైడ్ అయిపోవాల‌ని అనుకుంటున్నారు.ఆయ‌న స్థానంలో ఆయ‌న కుటుంబానికే చెందిన గ‌జ‌ప‌తిన‌గ‌రం బొత్స అప్ప‌ల‌న‌ర్స‌య్య‌కు ఛాన్స్ ఉంది. ఏదేమ‌యినప్ప‌టికి కొత్త జిల్లాల‌ను అనుస‌రించి జిల్లాకో మంత్రి చొప్పున తీసుకునే అవ‌కాశాలే ఉన్నాయ‌ని ప్ర‌ధాన మీడియా చెబుతోంది.

కొత్త మంత్రుల కోసం జ‌గన్ వెతుకులాట మొద‌లుపెట్టారు.ఆయ‌న అనుకున్న విధంగా మొద‌ట్నుంచి పార్టీని న‌మ్ముకున్న‌వారే మంత్రులు అవుతార‌ని తెలుస్తోంది. అయితే పార్టీ వాయిస్ ను వినిపించే వాళ్ల‌లో సీనియ‌ర్లు కొంద‌రు ఉన్నారు. వారిని కూడా కొన‌సాగించాల‌ని యోచిస్తోంది అధిష్టానం. పార్టీ ఆరంభం నుంచి ఉన్న కృష్ణ దాసు లాంటి సీనియ‌ర్ల‌కు ఉద్వాస‌న త‌ప్ప‌ద‌నే తెలుస్తోంది. స్పీక‌ర్ సీతారాం గొంతెమ్మ కోరిక ఒక‌టి ఉంది. అదేంటంటే ఆయ‌న ఎప్ప‌టి నుంచో మంత్రి కావాల‌ని అనుకుంటున్నారు.అందుకే ఆయ‌న కోరిక నెర‌వేర్చాల‌ని అనుకుంటున్నారు జ‌గ‌న్.

స్పీక‌ర్ ఎవ‌రు అన్న డైలామా కూడా ఉంది. ధ‌ర్మాన కృష్ణ‌దాసును కానీ ప్ర‌సాద‌రావును కానీ స్పీక‌ర్ ను చేయాల‌ని యోచిస్తున్నారు జ‌గ‌న్ అని వార్త‌లున్నాయి. కానీ అవేవీ నిజం కాద‌న్న వాద‌న కూడా ఉంది. ఇదే స‌మ‌యంలో సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజ‌న్న‌దొర (ఎస్టీ)ని స్పీక‌ర్ చేయాల‌ని అనుకుంటున్నారు. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ ఉత్త‌రాంధ్ర నుంచే మ‌రో సారి స్పీక‌ర్ ఛాన్స్ ఎవ‌రో ఒక‌రికి ద‌క్కనుంది.

Read more RELATED
Recommended to you

Latest news