కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనది డిఫరెంట్ మైండ్, డిఫరెంట్ క్యారెక్టర్ అంటూ వ్యాఖ్యానించారు. తాను గెలుపు ఓటమిని ఒకేలా చూస్తానని ఆయన అన్నారు. సంగారెడ్డిలో పాస్టర్స్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం వచ్చి పదవి ఇస్తా అని అన్నా.. నేను తీసుకోలేదని ఆయన అన్నారు. కొన్ని సార్లు ఓటమి కూడా మేలుగా అనిపిస్తుందని ఆయన అన్నారు. అధికారంలో ఉంటే అంతా తెలుస్తుందని అనుకుంటామని… కానీ అధికారంలో ఉంటే కొన్నే తెలుస్తాయని… అధికారంలో లేకపోతేేనే అనేక విషయాలు తెలుస్తాయని అన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. తాను ముగ్గురు సీఎంలు రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి పరిపాలనలో, రాజకీయ వ్యూహాల్లో పాలుపంచుకోవడం వల్ల తనకు పవర్ మీద పెద్దగా ఆసక్తి లేదని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. గెలుపు ప్రజాసేవకు, ఓటమి అనుభవానికి పనికి వస్తుందని వ్యాఖ్యానించారు. ఈరెండు కూడా ప్రతీ నాయకుడికి అవసరం అని ఆయన అన్నారు.