ఆ టీడీపీ నేత‌లు వైసీపీ ట్రాప్‌లో ప‌డ్డారే…!

Join Our Community
follow manalokam on social media

అనంత‌పురం జిల్లాలో టీడీపీకి అనేక నియోజ‌క‌వ‌ర్గాలు కంచుకోట‌లుగా ఉన్నాయి. పార్టీ గెలుపు ఓట‌ముల ‌తో సంబంధం లేకుండా ఇక్క‌డ టీడీపీ నాయ‌కులు చ‌క్రం తిప్పుతుంటారు. అయితే.. శింగ‌న‌మ‌ల నియోజ కవ‌ర్గంలో మాత్రం ప‌రిస్థితి దీనికి భిన్నంగా ఉంది. వైసీపీ ట్రాప్‌లో ఇక్క‌డి టీడీపీ నాయ‌కులు చిక్కుకున్నార‌ని అంటున్నారు. ఇప్ప‌టికే టీడీపీకి పెద్దదిక్కుగా ఉన్న టీడీపీ మాజీ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ శ‌మంత క‌మ‌ణి,ఆమె కుమార్తె, మాజీ విప్ యామిని.. కూడా వైసీపీలోకి చేరిపోయారు. దీంతో ఇప్పుడు వైసీపీ దూకుడు పెరిగింది.

 

ముఖ్యంగా ఎమ్మెల్యే జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి.. వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. అంతంత మాత్రంగా ఉన్న టీడీపీని మ‌రింత నిర్వీర్యం చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప్ర‌త్య‌ర్థి పార్టీగా దీనిని కోరుకోవ ‌డం త‌ప్పుకాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. టీడీపీ ఎస్సీ సెల్ నాయ‌కుడు ఎం.ఎస్ రాజు.. నియోజ‌క  వ‌ర్గంలో భారీ ఎత్తున కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. వీటికి స‌హ‌జంగానే టీడీపీ అనుకూల మీడియా ప్ర‌చారం క‌ల్పిస్తోంది. అయితే.. ఎమ్మెల్యే ప‌ద్మావ‌తి కూడా త‌న‌కు తెలిసిన మీడియాను కూడా ప్రోత్స‌హించి ఈ కార్య‌క్ర‌మాల‌ను ప‌దేప‌దే స్థానిక మీడియాలో ప్ర‌సార‌మ‌య్యేలా చేస్తున్నారు.

ఇక‌, సోష‌ల్ మీడియాలోనూ టీడీపీ కార్య‌క్ర‌మాలు జోరుగా సాగుతున్నాయి. ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి పార్టీకి ఎమ్మెల్యే ఇలా ప్రచారం చేయ‌డం ఏంటా? అనే సందేహం వ‌స్తుంది. ఇక్క‌డే ఉంది.. అస‌లు కిటుకు. నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ బాధ్యురాలుగా శ్రావ‌ణి ఉంటే.. ఆమెకు చెప్ప‌కుండానే రాజు ఇక్క‌డ ప‌లు ఆందోళ‌న‌లు, కార్య‌క్ర‌మాలు, ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా క‌ర‌ప‌త్రాలు పంచ‌డం. ఇంటింటికీ తిరిగి.. ప్ర‌జ‌ల‌ను క‌ల‌వ‌డం.. వంటివి చేస్తున్నారు. ఇది కొన్నాళ్లుగా శ్రావ‌ణికి ఇబ్బందిగా మారాయి. దీంతో ఆమె రాజుపై కొన్నాళ్లుగా ఆగ్ర‌హం వ్య ‌క్తం చేస్తున్నారు.

ఇక‌, ఇప్పుడు ఈ ప‌రిణామాల‌తో మ‌రింత‌గా ఇద్ద‌రి మ‌ధ్య గ్యాప్ మ‌రింతగా పెరుగుతుంద ‌ని వైసీపీ నాయ‌కురాలు అంచ‌నా వేస్తున్నారు. అయితే.. ఈ వైసీపీ వ్యూహాన్ని అర్ధం చేసుకోలేక పోతున్న టీడీపీ నాయ‌కులు ఈ ట్రాప్‌లో చిక్కుకుని కీచులాడుకోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇది పార్టీని నిల‌బెడుతుందా? ప‌డ‌గొడుతుందా?  చూడాలి.

TOP STORIES

రంజాన్ నెల ప్రారంభం.. విశేషాలు.. ప్రాముఖ్యత.. కొటేషన్లు..

రంజాన్ నెల ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఏప్రిల 14వ తేదీ నుండి మే 12వరకు రంజాన్ నెల ఉంటుంది. పవిత్రమాసమైన ఈ నెలలో ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో...