ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో అనేక విమర్శలు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి వీలులేదు అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అయినా సరే ఎన్నికల సంఘం మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇక ఇప్పుడు ఎన్నికల సంఘం కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్… ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానికి ఒక లేఖ రాసారు. ఈ లేఖలో ఆయన… ఫిబ్రవరిలో ఎన్నికలు ఉంటాయని చెప్పారు.
ప్రభుత్వ ఉద్దేశం చెప్పాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. దీనిపై ఇప్పుడు ఏపీ సర్కార్ సుప్రీం కోర్ట్ కి వెళ్ళే ఆలోచనలో ఉంది. ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని, ఏపీలో కరోనా రెండో వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని, వైద్య రంగంలో తాము వెనుకబడి ఉన్నామని, ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయని, ఆ ప్రాంతాలకు వైద్య సదుపాయాలను అందించడం పెద్ద మొత్తంలో సాధ్యం కాదని ఆయన సుప్రీం కోర్ట్ లో పిటీషన్ దాఖలు చేయాలని భావిస్తున్నారు.