వివేకా హత్య కేసు లో దూకుడు పెంచిన సిబిఐ…?

-

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విచారణ ను సిబిఐ ప్రత్యేక దర్యాప్తు బృందం వేగవంతం చేసింది. నగరం లోని సెంట్రల్ జైలు కేంద్రంగా కొనసాగుతుంది సిబిఐ అధికారుల విచారణ. ఈ రోజు పులివెందుల నుంచి వచ్చిన ముగ్గురు వివేకా పర్సనల్ టైలర్లను రెండవ రోజు ప్రశ్నిస్తున్నారు సీబీఐ అధికారులు. కర్నూలుకు చెందిన కొందరిని కూడా సిబిఐ అధికారులు విచారించారు.

ఎంపీ అవినాష్ రెడ్డి వ్యక్తిగత సిబ్బందిని కూడా సిబిఐ అధికారులు విచారించే అవకాశం ఉంది. వివేకా కుమార్తెను కూడా విచారించే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఇప్పటికే ఆమె సిబిఐ అధికారులకు పలు సాక్ష్యాలను కూడా అందించారు. వాటి ఆధారంగానే ఈ విచారణ జరుగుతుంది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news