గుడివాడలో మారిన సీన్..కొడాలిపై రావి.! 

ఇప్పటివరకు కొడాలి నాని..చంద్రబాబుని టార్గెట్ చేసి బూతులు తిట్టిన సరే గుడివాడ టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న రావి వెంకటేశ్వరరావు పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. కొడాలి దారుణంగా తిట్టిన సమయంలోనే రావి సైలెంట్ గా ఉండిపోయారు. ఏదో కృష్ణా జిల్లాకు చెందిన కొందరు టీడీపీ నేతలు కొడాలికి కౌంటర్ ఇచ్చారు. అయితే రావి పెద్దగా స్పందించలేదు. పైగా ఆయన గుడివాడలో చాలా రోజుల పాటు యాక్టివ్ గా లేరు.

కానీ ఈ మధ్య కాలంలో రావి దూకుడు పెంచారు..గుడివాడ సీటు తనదే అని, వచ్చే ఎన్నికల్లో కొడాలిని ఓడిస్తానని అంటున్నారు. ఇక ప్రతి వూరు తిరుగుతూ ప్రజలని కలుస్తున్నారు. టీడీపీని బలోపేతం చేసే దిశగా వెళుతున్నారు. ఇక కొడాలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా కొడాలి..చంద్రబాబుపై విమర్శలు చేశారు. తనపై బాబు గాని, లోకేష్ గాని పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. బాబుకే కాదు టీడీపీకి కూడా చివరి ఎన్నికలు అని అన్నారు. ఎన్‌ఆర్‌ఐలు ఎంత సొమ్ము పంచిన గుడివాడ ప్రజలు అమ్ముడు పొరని, తన చివరి రక్తపు బొట్టు వరకు వైసీపీ గెలుపు కోసం పోరాడతానని కొడాలి అన్నారు.

ఇక కొడాలికి కౌంటరుగా రావి ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. కొడాలి నానికి.. కిడ్నీతో పాటు బ్రెయిన్‌కు కూడా సర్జరీ జరిగినట్లుందని, కొడాలి బతుక్కి చంద్రబాబు, లోకేష్ కావాలా దమ్ముంటే తనపై గెలవాలని ఛాలెంజ్ విసిరారు.

అసలు ఇటువంటి నాయకులను ఎన్నుకొని ఇదేం ఖర్మ అని ప్రజలు అనుకుంటున్నారని, ఒక్క ఛాన్స్ అన్న జగన్‌కు ఇదే చివరి ఛాన్స్ అని,  హీరో అనుకుంటున్న కొడాలి లెక్కలన్నీ ఆధారాలతో తమ వద్ద ఉన్నాయని, అవినీతి సొమ్ముతో 2024 ఎన్నికల్లో బంగారు ముద్దలు ఇచ్చిన కొడాలి నాని ఓటమి తథ్యమని రావి ఫైర్ అయ్యారు.

అయితే గుడివాడలో కొడాలికి చెక్ పెట్టాలని చెప్పి రావి బాగా కసితో పనిచేస్తున్నారు. అటు టీడీపీ శ్రేణులు ఫుల్ యాక్టివ్ అయ్యాయి. మరి ఈ సారైనా కొడాలికి చెక్ పెట్టగలరో లేదో చూడాలి.