రోజా చెప్పిన మాటల్లో పాయింట్ ఉంది .. నిజమే కదూ ! 

-

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తరించకుండా ఏపీ ప్రభుత్వం చాలా చర్యలు చేపడుతుంది. ఈ నేపథ్యంలో ఎక్కువగా ఏపీలో కరోనా కట్టడికి బాగా కృషి చేస్తున్నది గ్రామ వాలంటరీ సభ్యులు. ఇటువంటి నేపథ్యంలో ఎక్కువ గుంపులు గుంపులుగా ఉండేచోట ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో గ్రామ వాలంటీర్లు చేస్తున్న పని తీరు పై వైసిపి ఫైర్ బ్రాండ్ రోజా సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు.YSRCP MLA Roja wins Nagari Assembly constituencyఏప్రిల్ ఫస్ట్ ఉదయం 6 గంటలనుండి గ్రామ వాలంటీర్లు లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేశారు. వేలి ముద్ర స్థానంలో ఫొటో గుర్తింపుతో పింఛన్లు అందజేస్తున్నారు.  ఈ సందర్భంగా రోజా ట్విటర్లో.. ‘దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉంటే.. పౌరులు ఇంట్లోనే ఉంటూ కొవిడ్-19తో పోరాడుతుంటే, మన ఏపీ విలేజ్‌ వారియర్స్‌ మాత్రం.. ఇబ్బందులు పడుతున్న వారికి సాయం అందిస్తూ పని చేస్తున్నారు. హ్యాట్సాఫ్‌ టు వాలంటీర్స్‌.. పింఛనులను డోర్‌ డెలివరీ చేస్తూ గొప్ప సేవలు అందిస్తున్నారు’ అని ట్వీట్ చేశారు.

 

రోజా చేసిన ట్వీట్ కి చాలా మంది నెటిజన్లు స్పందించారు. అవును మేడమ్ ఏపీలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థ లేకపోతే మొదటి స్థాయిలోనే కరోనా వైరస్ కట్టడి విషయంలో చాలా ప్రమాదం జరిగేది….ఇటువంటి ప్రమాదకరమైన వైరస్ నుండి ప్రజలను రక్షించడానికి గ్రామ వాలంటీర్లు ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నారు అంటూ కొనియాడుతున్నారు. ఇదే తరుణంలో మరికొంత మంది నెటిజన్లు రోజా చెప్పిన మాటల్లో పాయింట్ ఉంది .. నిజమే కదూ హ్యాట్సాఫ్ టు గ్రామ వాలంటీర్స్ అంటూ కామెంట్ పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news