మోడీ బొమ్మ లేకుండా ఈటల రాజేందర్ ప్ర‌చారం చేయ‌డానికి అస‌లు ప్లాన్ ఇదే

-

ఏ రాజ‌కీయ పార్టీ త‌ర‌ఫున పోటీ చేస్తున్న అభ్య‌ర్థి అయినా స‌రే తాను ఎంత బ‌లంగా ఉన్నా స‌రే పార్టీకి కీల‌కంగా ఉండే అధినాయ‌కుడి పేరు లేదా ఆ పార్టీకి ముఖ్య నాయ‌కుడి పేరు అనేది క‌చ్చితంగా ఉప‌యోగిస్తారు. ఇక వారి ఫొటోను చూపించే రాజ‌కీయాలు చేస్తార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అలా చేస్తేనే ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం ఏర్ప‌డుతుంద‌ని, లేదంటే త‌మ పేరే చెప్పుకుంటే ఓట్లు పెద్ద‌గా రావ‌ని అంద‌రికీ విదిత‌మే. అయితే ఇప్పుడు తెలంగాణ‌లో అత్యంత కీల‌కంగా ఉంటున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో సీన్ వేరేలా ఉంది.ఇక్క‌డ బీజేపీ తరఫున పోటీ చేస్తున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ మొద‌టి నుంచే పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. ఇక ఇంకోవైపు ప్ర‌ధాన పోటీ దారుగా టీఆర్ ఎస్ కూడా సర్వ శక్తులను ఒడ్డుతోంది.

ఏకంగా దళిత బంధు లాంటి పథకాన్ని కూడా పైలట్ ప్రాజెక్టుగా ఇక్క‌డి హుజురాబాద్‌లోనే లాంచ్ చేయడానికి సీఎం కేసీఆర్ రెడీ అవుతున్నారు. అయితే ఈ ఎన్నిక‌ల‌ను బీజేపీ వ‌ర్సెస్ టీఆర్ఎస్ కాకుండా ఈటల వర్సెస్ కేసీఆర్ అనే సీన్ క్రియేట్ చేసేందుకు మాజీ మంత్రి ఈటల రాజేందర్ చాలా ప్రయత్నిస్తున్నారు.

ఇక ఈ క్ర‌మంలోనే ప్రచారంలో ఎక్కడా కూడా దేశ ప్ర‌ధాని మోడీ బొమ్మ కానీ లేదంటే ఆ త‌ర్వాత ప‌వ‌ర్ ఫుల్ నాయ‌కుడు అయిన అమిత్ షా ఫొటో గానీ లేకుండానే ప్ర‌చారం చేస్తున్నారు. ఇక్క‌డే ఈట‌ల రాజేంద‌ర్ పెద్ద స‌వాళ్ల‌ను ఎదుర్కొంటున్నారు. దీన్ని బేస్ చేసుకుని ట్రబుల్ షూటర్ హరీశ్ విమర్శిస్తున్నారు. అయితే ముందు జాగ్రత్తలో భాగంగానే ఈట‌ల రాజేంద‌ర్ మోడీ, అమిత్ షాల ఫొటోలు వాడట్లేద‌నే ప్రాచంర సాగుతోంది. దేశంలో నిత్య‌వ‌స‌ర స‌రుకుల ధ‌ర‌లు, అలాగే పెట్రోల్, డీజిల్ రేట్లు విప‌రీతంగా పెర‌గ‌డంతో వారిపై జ‌నాల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంది. అందుకే వారి ఫొటోలు వాడ‌ట్లేద‌ని తెలుస్తోంది. అందుకే ఈ ఎన్నిక‌ల‌ను బీజేపీ వ‌ర్సెస్ టీఆర్ెస్ అన్న‌ట్టు కాకుండా ఈట‌ల వ‌ర్సెస్ కేసీఆర్ అన్న విదంగా క్రియేట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news