ప‌వ‌న్ నుంచి స్ప‌ష్ట‌మైన హామీ కావాలంటున్న ఆ నేత‌లు..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మొద‌టి నుంచి గెలుపు, ఓట‌ముల‌ను పెద్ద‌గా సీరియ‌స్‌గా తీసుకోబోమ‌ని చెబుతూనే ఉన్నారు. తాము రాజకీయాల్లో పూర్తిగా మార్పు తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌ని, అంతేగానీ ప‌ద‌వులే కీల‌కంగా ప‌నిచేయ‌మ‌ని ఇప్ప‌టికే ఎన్నో సార్లు ప్ర‌క‌టించేశారు. కాగా ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయానా కూడా ఇలాగే త‌న సిద్ధాంతాన్ని అమ‌లు చేస్తున్నారు. అయితే ఆయ‌న మాట‌ల‌ను నిజం చేసిచూపించేందుకు ఏపీలో ఆయ‌న పార్టీ జ‌న సైనికులు కూడా బాగానే తిరుగుతున్నారు. అయితే ఇక్క‌డో మ‌రో విష‌యం కూడా ఉంది.

pawan kalyan
pawan kalyan

జ‌న‌సేన త‌ర‌ఫున 2019 ఎన్నికల్లో ప‌వ‌న్ పాటు చాలామంది పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఇలా ఓడిపోయిన వారిలో చాలామంది ఇత‌ర పార్టీల్లోకి వెళ్లిపోయారు. మ‌రి కొంద‌రేమో సైలెంట్ అయిపోయారు. కానీ కొంతమంది మాత్రం వేరే పార్ట‌లకు వెళ్ల‌కుండా జ‌న‌సేన‌లోనే యాక్టివ్ గా కొఉంటున్నారు. ఇప్ప‌టికి కూడా పార్టీలో కీల‌కంగా ప‌నిచేస్తూ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏ పిలుపు ఇచ‌చినా స‌రే దాన్ని పార్టీ త‌ర‌ఫ‌/న వారే స‌క్సెస్ చేస్తున్నారు.

అయితే వీరంతా కూడా రాబోయే 2024 ఎన్నికల్లో మ‌ళ్లీ అవ‌కాశం కోసం ఇలా చేస్తున్నారు. న‌మ్మిన సిద్దాంతం కోసం ప‌వ‌న్ క‌ల్యాణ్ ను న‌మ్ముకుని ప‌నిచేస్తున్నారు. మ‌రోసారి అవ‌కాశః ఇస్తే ఈ సారి ఎలాగైనా గెలిచేందుకు బాగానే క‌ష్ట‌ప‌డుతున్నారు. ఒక‌వేళ గెల‌వ‌క‌పోయినా కూడా రాజ‌కీయంగా ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు అయినా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని భావిస్తున్నారు. కాబ‌ట్టి ఇలాంటి వారికి ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌చ్చితంగా ఆలోచించి వారి రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం హామీ ఇవ్వాల‌ని వీరంతా కూడా కోరుతున్నారు. వారికి ఇప్పుడు ప‌వ‌న్ భ‌రోసా ఇస్తే మ‌రింత జోష్ తో ప‌నిచేస్తామంటూ చెబుతున్నారు. మ‌రి ప‌వ‌న్ ఏంచేస్తారో చూడాలి.