ఆ ముగ్గురు సీట్లు అవుట్..జగన్ ఫిక్స్.!

-

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది ఎవరికి టికెట్లు ఇస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంత్రులు,ఎమ్మెల్యేలతో జగన్ నిర్వహించిన సమావేశంలో అందరికీ మళ్లీ టిక్కెట్లు ఇవ్వలేమని, కొందరికి మాత్రమే టికెట్లు ఇస్తానని, టికెట్లు ఇవ్వకపోయినా అందరూ తనవారేనని బహిరంగంగానే చెప్పారు. అప్పటినుండి ఎమ్మెల్యేలందరూ ఎవరిని ఉంచుతారో?ఎవరిని తుంచుతారో?అని ఆందోళనలో ఉన్నారు.

ప్రతి జిల్లాలోను సమన్వయకర్తల సమావేశంలో విజయసాయిరెడ్డి అభ్యర్థుల పేర్లు ప్రకటించి వారిని గెలిపించాలని సూచిస్తున్నారు. అలాగే తిరుపతిలో జరిగిన జిల్లా సమావేశంలో కూడా తిరుపతి అభ్యర్థిగా భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డిని, శ్రీకాళహస్తి అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిని, వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్.రామ్ కుమార్ రెడ్డిని, చంద్రగిరి అభ్యర్థిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని విజయసాయి ప్రకటించారు.

ఇక ఎస్సీ రిజర్వుడ్ స్థానాలు అయిన సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు స్థానాలకు అభ్యర్థులు ఎవరో తెలపకపోవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇవ్వడం లేదని తెలుస్తోంది. సత్యవేడు, సూళ్లూరుపేటలో ఎమ్మెల్యేలపై నియోజకవర్గాలలో,నాయకులలో కూడా తీవ్ర వ్యతిరేకత ఉండడం వల్లే వారి పేర్లు ప్రకటించలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ముఖ్యంగా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ పై ప్రజా వ్యతిరేకత మాత్రమే కాదు. సొంత పార్టీలో వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. అక్కడ సంస్థాగతంగా వైసీపీ బలంగా ఉంది..కానీ ఎమ్మెల్యే వల్ల పార్టీ ఓడిపోయే పరిస్తితి కూడా ఉంది. అందుకే ఆ ఎమ్మెల్యేని ఖచ్చితంగా జగన్ తప్పించి..ఆ స్థానంలో కొత్తవారిని నిలబెడతారని తెలుస్తోంది.

అటు సూళ్ళూరుపేటలో కూడా అలాంటి పరిస్తితి కనిపిస్తుంది. రెడ్డి వర్గంతో ఎమ్మెల్యేకు పెద్దగా పొసగడం లేదని సమాచారం. మొత్తానికి రిజర్వ్ సీట్లలో ఈ సారి మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news