ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నియోజకవర్గ స్థాయిలో రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి.. టిక్కెట్ కోసం చేస్తున్న ప్రయత్నాలు తారా స్థాయికి చేరుకున్నాయి.. ధర్మవరం టిడిపి రాజకీయాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి.. పరిటాల శ్రీరామ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి అన్నట్లుగా అక్కడ రాజకీయాలు నడుస్తున్నాయి.. ఇంతకీ చంద్రబాబుకు 100 కోట్ల ఆఫర్ ఇచ్చిన నేత ఎవరో చూద్దాం..
ధర్మవరం టిడిపిలో టిక్కెట్ ఫైట్ రచ్చకెక్కింది.. ఇక్కడి నుంచి పరిటాల శ్రీరామ్ టిక్కెట్ ఆశిస్తున్నారు.. ఇన్చార్జిగా కొనసాగుతున్న ఆయన.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిరసనలు చేస్తూ ఉన్నారు.. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టిక్కెట్ తనకేం అంటూ తన అనుచరుల వద్ద చెప్పుకుంటున్నారు.. అయితే 2019 ఎన్నికలకు ముందు టిడిపి నుంచి బిజెపిలో చేరిన వరదాపురం సూరి సైతం టిడిపి టికెట్ తనకేం అంటూ ప్రచారం చేస్తున్నారు.. సడన్ గా వరదాపురం సూరి స్వరం మార్చడం పై పరిటాల శ్రీరామ్ అగ్రహ వ్యక్తం చేస్తున్నారు..
ధర్మవరం టికెట్ కోసం చంద్రబాబుకు 100 కోట్లు ఇచ్చారంటూ వరదపురం సూరి అనుచరులు చేసిన కామెంట్స్ నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారాయి.. దానికి తోడు చంద్రబాబు వరదాపురం సూరి ఉన్న ఫ్లెక్సీలు నియోజకవర్గంలో దర్శనమిస్తున్నాయి..
చంద్రబాబుకు 100 కోట్లు ఇచ్చారంటూ సూరి అనుచరులు చేసిన వ్యాఖ్యలు అసమ్మతి వర్గంగా ఉన్న పరిటాల శ్రీరామ్ కి ఆయుధంలా తయారయ్యాయి.. తమ అధినేతనుకునే అంత దమ్ము ధైర్యం వరదాపురం సూరి కి లేవంటూ శ్రీరామ్ రచ్చకెక్కారు..
గత ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీ చేసి.. ఓడిన 20 రోజులకె సూరి పార్టీ జెండా మార్చేశారని పరిటాల శ్రీరామ్ అనుచరులు మండిపడుతున్నారు.. కేసులకు భయపడే వరదాపురం సూరి.. మళ్లీ టిడిపిలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని.. తమ పార్టీలోకి రావాలంటే కార్యకర్తలకు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ పరిటాల శ్రీరామ్ డిమాండ్ చేస్తున్నారు.. వీరిద్దరి మధ్య టిక్కెట్ ఫైట్ తార స్థాయికి చేరడంతో టిడిపి క్యాడర్ గందరగోళానికి గురవుతోంది.. పార్టీ టికెట్ కోసం 100 కోట్లు పండ్ ఇచ్చారనే ప్రచారం మాత్రం సంచలనంగా మారింది..