వ‌డ్ల కొనుగోలు పై టీఆర్ఎస్ దుష్ప్ర‌చారం చేస్తుంది- విజ‌య‌శాంతి

-

వ‌డ్ల కొనుగోలు పై తెలంగాణ లో టీఆర్ఎస్ పార్టీ నేత‌లు దుష్ప్ర‌చారం చేస్తున్నారని బీజేపీ నాయ‌కులు మాజీ ఎంపీ విజ‌య శాంతి అన్నారు. వ‌డ్ల కొనుగోలు విషయంలో తెలంగాణ ప్ర‌భుత్వం పూటకు ఒక‌ నాటకం ఆడుతుంద‌ని మండి ప‌డ్డారు. ఈ విష‌యంలో టీఆర్ఎస్ నాయ‌కులు బీజేపీ నాయకత్వం పై నిందలు వెయ్యడమే పనిగా పెట్టుకున్నార‌ని విమ‌ర్శించారు.

కొన్ని రాష్ట్రాల‌లో ఉప్పుడు బియ్యం మంచి డిమాండ్ ఉంటుంది. కాబ‌ట్టి నెలకు 5 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం ఇచ్చినా కొంటామని ఎఫ్‌సీఐ తెలిపింద‌ని అన్నారు. అయినా తెలంగాణ సర్కారులో కదలిక రాలేద‌ని విమ‌ర్శించారు. అక్టోబర్ నెలాఖరు నాటికి 44.75 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యాన్ని ఎఫ్‌సీఐకి రాష్ట్ర ప్రభుత్వం పంపాల్సి ఉండగా.. కేవ‌లం స‌గ‌మే పంపారని తెలిపారు. అలాగే ఈ బియ్యాన్ని దేశంలోని మధ్యాహ్న భోజన పథకానికి ఉప‌యోగించాల‌ని చూస్తుంద‌ని తెలిపారు.

 

దాని కోసం ఉప్పుడు బియ్యాన్ని భారీగా సేక‌రిస్తుంద‌ని అన్నారు. దీనాపై తెలంగాణ నుంచి సరైన స్పందన రాలేదని తెలిపారు. ఇన్ని అవ‌కాశాలు ఉన్నా.. వాటిని వినియోగించు కోకుండా కేంద్రం పై నింద‌లు వేయ‌డ‌మే టీఆర్ఎస్ నాయ‌కులు ప‌నిగా పెట్టుకున్నార‌ని విమ‌ర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news