ఈటల రాజేందర్ కు ఎప్పుడైతే టీఆర్ ఎ స్ తో వైరం మొదలైందో అప్పటి నుంచి కేసీఆర్ టీం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఈటల విషయంలో ఎవరిని పడితే వారిని మాట్లాడనివ్వట్లేదు. ఈటలకు అనుకూలంగా ఉన్న టీఆర్ ఎ స్ నేతలతోనే కౌంటర్ ఇప్పిస్తోంది. మొన్న రాజీనామా చేస్తున్నానని చెప్పిన ఈటల ఆ సందర్భంగా కవిత, హరీశ్ రావులపై అనేక కామెంట్లు చేశారు.
అయితే కవితపై చేసిన విమర్శలకు ఈటల అనుకూల వ్యక్తులతోనే అధిష్టానం సమాధానం చెప్పిస్తోంది. ఇప్పుడు ఆయనకు చాలా సన్నిహితుడిగా పేరున్న పుట్టమధును సైతం వాడింది. కవిత సీఎం కూతురుగానే కాకుండా ప్రజల మనిషిగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారని మధు వెల్లడించారు.
ఆమె మంథని నియోజకవర్గంలో చీకటి పాలనను అంతమొందించి, ఎన్నో అభివృద్ధి కార్యక్మరాలు చేశారని మధు చెప్పుకొచ్చారు. ఆమె చేస్తున్న కృషిని గుర్తించి టీబీజీకేఎస్ నేతలే కవితను గౌరవ అధ్యక్షురాలు ఎన్నుకున్నారని స్పష్టం చేశారు. కవితకు ఆ కార్మిక సంఘం తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని పుట్ట మధు వివరించారు. దీంతో ఇప్పుడు పుట్టమధు కూడా టీఆర్ ఎస్ వైపు ఉంటాడని అర్థమవుతోంది.