కారుకు ఈటల టెన్షన్..మునుగోడులో అదిరిపోయే స్ట్రాటజీ?

టీఆర్ఎస్ పార్టీకి బీజేపీతో దిన దిన గండంగా ఉందనే చెప్పాలి…రోజురోజుకూ బీజేపీ బలపడటం కారు పార్టీకి మింగుడుపడని విషయం. అయితే బీజేపీ ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో ఎక్కడకక్కడ టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టే దిశగా ముందుకెళుతుంది. అయితే లోపల వ్యూహాలు ఎలా ఉన్నాయో తెలియదు గాని…పైకి మాత్రం మైండ్ గేమ్ తో బీజేపీ నేతలు…కారు పార్టీని ఆడేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈటల రాజేందర్, బండి సంజయ్ లు..తమదైన శైలిలో రాజకీయం చేస్తూ…టీఆర్ఎస్ పై మాటల దాడికి దిగుతున్నారు. అలాగే తమ మైండ్ గేమ్ తో టీఆర్ఎస్ పార్టీకి కొత్త తిప్పలు తెస్తున్నారు.

అసలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, ఇంకా 10, 12 ఉపఎన్నికలు వస్తాయని ఇప్పటికే టీఆర్ఎస్ లో టెన్షన్ పుట్టించారు. అసలు బీజేపీలో చేరికల కమిటీ ఛైర్మన్ గా ఉన్న ఈటలతో మరీ డేంజర్ గా ఉందని చెప్పొచ్చు. ఆయన పూర్తిగా టీఆర్ఎస్ నేతలని లాగేసే ప్రయత్నాలు చేస్తున్నారు. పాత పరిచయాలని వాడుకుంటూ… టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలని బీజేపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈటల స్ట్రాటజీ ఏంటో పూర్తిగా అర్ధం కాకుండా ఉంది….ఒకసారి ఏమో ఏకంగా గజ్వేల్ లో పోటీ చేసి కేసీఆర్ ని ఓడిస్తానని మాట్లాడుతున్నారు…అలాగే తమకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని, త్వరలోనే వారు బీజేపీలోకి వస్తారని మాట్లాడుతున్నారు. ఇక మునుగోడులో కారు పార్టీని ఓడించడానికి తమ దగ్గర అదిరిపోయే స్ట్రాటజీ ఉందని ఈటల అంటున్నారు.

అయితే ఈటల మాట్లాడే ప్రతి మాటపై టీఆర్ఎస్ లో చర్చ జరుగుతుందట..అసలు బీజేపీకి టచ్ లో ఉన్నారని అంటున్నారు…ఆ ఎమ్మెల్యేలు ఎవరు అని? అలాగే గజ్వేల్ లో పోటీ చేస్తే…కేసీఆర్ కు గెలుపు కష్టమైపోతుందా? అనే డౌట్ టీఆర్ఎస్ శ్రేణుల్లో వస్తుంది. ఇప్పుడు మునుగోడులో స్ట్రాటజీ అంటున్నారు…ఆ స్ట్రాటజీ ఏంటి అని కారు నేతలు జుట్టు పీక్కునే పరిస్తితి. మొత్తానికి ఈటల మాత్రం..కారుని షేక్ చేస్తున్నారు.