వరంగల్ వార్: కారు వర్సెస్ కాంగ్రెస్.. కమలానికి ఛాన్స్ లేదా?

-

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ బాగా బలంగా ఉన్న జిల్లాల్లో వరంగల్ కూడా ఒకటి. టీఆర్ఎస్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ జిల్లాలో సత్తా చాటుతూనే ఉంది. ఇక రాష్ట్ర విభజన జరిగాక జిల్లాలో టీఆర్ఎస్‌కు తిరుగులేకుండా పోయింది. 2014, 2018 ఎన్నికల్లో అదిరిపోయే విజయాలని సొంతం చేసుకుంది. మరి ఇలా వరుసగా వరంగల్ జిల్లాలో సత్తా చాటుతున్న టీఆర్ఎస్‌కు వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పరిస్తితి ఎదురవుతుంది అంటే…. ఈసారి మాత్రం కాస్త గట్టి పోటీ వచ్చేలా ఉంది.

trs-congress-bjp గత రెండు సార్లు అంటే టీఆర్ఎస్‌ వేవ్ వల్ల ప్రత్యర్ధి పార్టీలు పోటీ ఇవ్వలేకపోయాయి. కానీ ఈ సారి ఆ పరిస్తితి ఉండేలా కనిపించడం లేదు. ఈ సారి కాంగ్రెస్, బీజేపీలు గట్టి పోటీ ఇచ్చేలా ఉన్నాయి. అయితే ఇక్కడ బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీనే స్ట్రాంగ్‌గా ఉందని చెప్పాలి. ఆ పార్టీకి క్షేత్ర స్థాయిలో బలం ఉంది..ఆ పార్టీ తరుపున బలమైన నాయకులు ఉన్నారు. కానీ బీజేపీకి క్షేత్ర బలం లేదు..బలమైన నాయకత్వం లేదు.

గత ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ కాస్త పోటీ ఇచ్చిందనే చెప్పాలి. జిల్లాలో 12 సీట్లు ఉంటే రెండు సీట్లలో కాంగ్రెస్ గెలిచింది. ములుగులో సీతక్క, భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి విజయం సాధించారు. 10 స్థానాల్లో టీఆర్ఎస్ గెలిచింది. అయితే గండ్ర ఆ తర్వాత టీఆర్ఎస్ వైపు వెళ్ళిపోయారు. దీంతో సీతక్క ఒక్కరే కాంగ్రెస్‌లో మిగిలారు.

అయితే వచ్చే ఎన్నికల్లో దాదాపు అన్నీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పైగా ఇప్పుడు టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వస్తుంది. దాదాపు సగం పైనే ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది. ఇది కాంగ్రెస్‌కు కలిసొచ్చే అవకాశం ఉంది. ఇక కొన్ని చోట్ల బీజేపీ కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ బలమైన నాయకులని తీసుకుంటే ఏమన్నా ప్రభావం చూపించగలదు. లేదంటే కారు, కాంగ్రెస్‌ల మధ్యే పోరు నడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news