కాంగ్రెస్‌లో ట్విస్ట్…మునుగోడు సీటు ఫిక్స్?

-

ఇప్పటికే మునుగోడు రేసులో బీజేపీ-టీఆర్ఎస్ పార్టీలు ముందంజలో ఉన్నాయి…కానీ తమ సిట్టింగ్ స్థానంలో కాంగ్రెస్ మాత్రం వెనుకబడింది. ఇప్పటికే కాంగ్రెస్ నేతల పంచాయితీ ఢిల్లీలో నడుస్తోంది…ఓ వైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం నడుస్తుండగా, మరోవైపు సీనియర్లు…రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఇటు మునుగోడులో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఏమో దూసుకెళుతున్నాయి.

బీజేపీ తరుపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో ఉండగా, టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి దాదాపు ఖరారైపోయినట్లే. కానీ కాంగ్రెస్ మాత్రం అభ్యర్ధిని ఖరారు చేయడానికే నానా తిప్పలు పడుతుంది. మునుగోడు సీటు కోసం చాలామంది ఆశావాహులు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. వీరిలో ఎవరికి టికెట్ ఇవ్వాలో తెలియక కాంగ్రెస్ అధిష్టానం కన్ఫ్యూజ్ అవుతుంది. అయితే తాజాగా కాంగ్రెస్ అధిష్టానం…టికెట్ విషయంలో ఒక క్లారిటీకి వచ్చేసినట్లు కనిపిస్తోంది.

మునుగోడు టికెట్ రేసులో ఇప్పటివరకు నలుగురి పేర్లు వినిపించాయి. పాల్వాయి స్రవంతి, చల్లమల్ల కృష్ణా రెడ్డి, పల్లె రవికుమార్, కైలాష్ నేత రేసులో ఉన్నారు. కానీ ఫైనల్‌గా ఇద్దరు పేర్లు మాత్రం షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలిసింది. స్రవంతి, కృష్ణారెడ్డిలని ఫైనల్ లిస్ట్‌లో చేర్చినట్లు సమాచారం. అయితే వీరిలో ఎవరికి టికెట్ ఇవ్వాలనే అంశంపై సర్వే చేయగా, ఇందులో స్రవంతికే ఎక్కువ ఓట్లు పడినట్లు తెలుస్తోంది…అటు కృష్ణారెడ్డి కూడా స్రవంతికి దగ్గరగానే ఉన్నట్లు తెలిసింది.

కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం స్రవంతి వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం..ఎందుకంటే స్రవంతి తండ్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి….గతంలో అయిదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అలాగే 2014లో స్రవంతి పోటీ చేసి ఓడిపోయారు…2018లో కోమటిరెడ్డి కోసం సీటు త్యాగం చేశారు. ఈ పరిణామాలు స్రవంతికి బాగా కలిసొస్తున్నట్లు సమాచారం. అందుకే మునుగోడు సీటు దాదాపు స్రవంతికే ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. మరి అభ్యర్ధిని ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news