పీఠాపురంలో వార్ వన్ సైడ్…..ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఘ‌న విజ‌యం

-

పీఠాపురంలో ఈసారి కూడా ప‌వ‌న్ కళ్యాణ్ ఓడిపోతారు…కాదు కాదు డిపాజిట్లు కూడా ద‌క్క‌వ‌ని కామెంట్లు వినిపించాయి. ఇలా అనేక విధాలుగా కామెంట్లు చేసిన కొంద‌రు రాజ‌కీయవేత్త‌ల‌కు భారీ విజ‌యంతో గ‌ట్టిగా స‌మాధానం చెప్పారు జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.పిఠాపురంలో ఆయ‌న 70,354 ఓట్ల భారీ మెజారిటీతో విజ‌చ‌యం సాధించారు.వైసీపీ నుంచి పోటీ చేసిన వంగా గీత ప‌వ‌న్‌కు ఏ రౌండ్‌లోనూ పోటీ ఇవ్వ‌లేక‌పోయారు.ప్ర‌తి రౌండ్‌లో ఆధిక్య‌త ప్ర‌ద‌ర్శించిన ప‌వ‌న్ తిరుగులేని మెజారిటీతో అపూర్వ విజ‌యాన్ని సాధించారు. 2019లో పోటీ చేసిన రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆయ‌న ఓడిపోయినా లోపాల‌ను స‌రిదిద్దుకుని ప‌డి లేచిన కెర‌టంగా ప‌క్కా ప్ర‌ణాళిక‌తో పిఠాపురం నుంచి బ‌రిలోకి దిగారు.ఎవ్వ‌రూ ఊహించ‌ని విజ‌యాన్ని న‌మోదు చేసిన అసెంబ్లీలో అడుగుపెట్ట‌బోతున్నారు.

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజారిటీ సాధించారు.ఇక్కడ వైసీపీ తరపున వంగా గీత ఆయ‌న‌తో పోటీ ప‌డ్డారు.ఇక ఎగ్జిట్ పోల్‌లో ఆరా మస్తాన్ చేసిన సర్వేలో పిఠాపురంలో పవన్ విజయం దక్కించుకుంటున్నట్టు చెప్పారు. అంతేకాదు.. ఆయనకు 40 నుంచి 50 వేల ఓట్ల మెజారిటీ వస్తుందని చెప్పారు. కాపుల ఓట్లు గంప‌గుత్తగా ఆయనకే పడ్డాయని కూడా.. ఈ సర్వే వెల్లడించింది. ఇక్కడ ఒకటికి రెండు సార్లు సర్వే చేసినట్టు ఆరా మస్తాన్ వివరించారు. ఇక, కేకే సర్వే వెల్లడించిన వివరాలు జనసేన నాయకులు, కార్యకర్తల్లో మరింత జోష్ నింపాయనే చెప్పాలి. ఇక్కడ పోలింగ్ అంతా ఏకపక్షంగా జరిగిందని ఈ సర్వే వివరించింది. కనీ వినీ ఎరుగని రీతిలో ఇక్కడ పవన్ కల్యాణ్ విజయం దక్కించుకుంటున్నట్టు ఈ సర్వే పేర్కొంది. అయితే.. మెజారిటీ విషయంలో పక్కా వివరాలు వెల్లడించకపోయినా.. లక్ష మెజారిటీదాటి వస్తుందని అంచ‌నా వేసింది కెకె స‌ర్వే. ఈ రెండు సర్వేలు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ తిరుగులేని ఆధిక్యాన్ని ఇక్క‌డ‌ కనబరిచారు.

2019లో ఒంటరిగానే ఎన్నిక‌ల‌కు వెళ్ళిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ భీమవరం,గాజువాక నుంచి పోటీ చేశారు.భీమ‌వ‌రంలో వైసీపీ అభ్య‌ర్ధి గ్రంథి శ్రీ‌నివాస్ చేతిలో 8357 ఓట్ల తేడాతో ఓట‌మి చెందారు.అటు గాజువాక‌లోనూ ఆయ‌న ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకున్నారు.వైసీపీ అభ్య‌ర్ధి తిప్ప‌ల నాగిరెడ్డి చేతిలో 16,753 ఓట్ల మెజారిటీతో ఓట‌మి చెందారు.ఓడిపోయాన‌ని నైరాశ్యానికి లోనుకాకుండా 2024 ఎన్నిక‌ల‌పై ఫోక‌స్ చేశారు.అంది వ‌చ్చిన అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకుని అటు బీజేపీ,ఇటు టీడీపీతో జ‌ట్టుక‌ట్టి ఈ ఎన్నిక‌ల్లో త‌న విజ‌యానికి వ్యూహ ర‌చ‌న‌లు చేశారు. వారాహి యాత్ర‌తో తాను ఏంటో ప్ర‌జ‌ల‌కు చెప్పుకున్నారు. పిఠాపురంలో టీడీపీ శ్రేణుల స‌హ‌కారంతో ఆయ‌న తిర‌గులేని విజ‌యాన్ని న‌మోదు చేశారు.మొత్తానికి ప‌దేళ్ళ నిరీక్ష‌ణ‌కు తెరదించిన మొద‌టిసారి ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్ట‌బోతున్నారు.కాగా ఆయ‌న‌కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి ఇస్తార‌ని టాక్ వినిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news