ప‌వ‌న్ ఎడ్డెం… బీజేపీ తెడ్డెం… అప్పుడే లుక‌లుక‌లు…!

-

ఏపీలో పాత మిత్రులు కొత్త‌గా జ‌ట్టుక‌ట్టిన విష‌యం తెలిసిందే. అయితే, అనూహ్యంగా అప్ప‌టి వ‌ర‌కు జ‌న‌సే న వినిపించిన రాజ‌ధాని పాజిటివ్ గ‌ళం త‌గ్గిపోయింది. దీంతో ఇదేంటి? అని రాజ‌ధాని రైతులు ఆశ్చ‌ర్య పో యారు. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీ రాజ‌ధాని విష‌యంలో ఇత‌మిత్థంగా బీజేపీ వ్యూహం ఏంట‌నేది తెలియ దు. రాష్ట్రంలోని బీజేపీ నాయ‌కులు ఒక‌ర‌కంగా మాట్లాడుతున్నారు. అంటే.. మూడు రాజ‌ధానుల‌కు తాము వ్య‌తిరేకంగా ఉన్నామ‌ని చెబుతూనే మ‌ళ్లీ క‌ర్నూలులో హైకోర్టు పెట్టేందుకు తాము అన్ని విధాలా స‌హ‌క‌రిస్తా మ‌ని రాష్ట్ర నేతలే చెబుతున్నారు.

ఇక‌, కేంద్రం నుంచి వ‌చ్చి రాష్ట్రంలో మాట్లాడుతున్న నాయ‌కులు మాత్రం మూడు రాజ‌ధానుల విష‌యం లో కేంద్రం ఎట్టి ప‌రిస్థితిలోనూ క‌లుగ‌జేసుకోద‌ని చెబుతున్నారు. సో.. ఈ విష‌యంలో బీజేపీ వైఖ‌రి స్ప‌ష్టం గా లేదు. ఇదిలావుంటే, బీజేపీతో ఇటీవ‌లే జ‌ట్టు క‌ట్టిన జ‌న‌సేన మాత్రం ఈ విష‌యంలో భిన్న‌మైన వైఖ రినే ప్ర‌ద‌ర్శించింది. బీజేపీతో జ‌ట్టు క‌ట్ట‌క ముందు వ‌ర‌కు కూడా.. మూడు రాజ‌ధానుల‌కు తాము వ్య‌తిరేక మ‌ని చెప్పింది.

అదే స‌మ‌యంలో క‌ర్నూలులో హైకోర్టుకు కూడా వ్య‌తిరేక‌మ‌ని వెల్ల‌డించిం ది. అస‌లు సుప్రీం కోర్టు ఒప్పుకోవాలి క‌దా.. ఎలా ఒప్పుకొంటుంది. ఇప్ప‌టికే ఏపీలో హైకోర్టుకు సుప్రీం అప్ప‌టి ప్ర‌ధాన న్యాయమూర్తి వ‌చ్చి ప్రారంభించార‌ని చెబుతోంది. దీంతో ఈ రెండు పార్టీల మ‌ధ్య రాజ‌ధాని విష‌యంలో భిన్న‌మైన వైఖ‌రి ఏర్ప‌డ‌డంతో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ట్టు క‌ట్టిన త‌ర్వాత అటు బీజేపీ నుంచి కానీ, ఇటు జ‌న‌సేన నుంచి కానీ నాయ‌కులు ఏ ఒక్క‌రూకూడా రాజ‌ధాని ప్రాంతంలో అడుగు పెట్ట‌లేదు.

ఈ నేప‌థ్యంలో తెర‌చాటున ఈ రెండు పార్టీల‌పై కూడా తీవ్ర‌మైన ఒత్తిడి పెరుగుతోంది. దీనిని గ‌మ‌నించిన ఇరు పార్టీల నాయ‌కులు కూడా ఇప్పుడు సంయుక్తంగా పోరుకు సిద్ధ‌మ‌వుతున్నారు. తాజాగా విజ‌య‌వాడ‌లో భేటీ అయిన ఇరు పార్టీల నాయ‌కులు అమ‌రావ‌తి స్టాండ్‌నే వినిపించాల‌ని భావిస్తున్నారు. కానీ, నిజానికి కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు ఈ పోరుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేద‌నేది వాస్త‌వం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news