హుజూరాబాద్ ఉపఎన్నిక పోరు క్లైమాక్స్‌కు చేరుకుంది..అక్టోబర్ 30న ఎన్నిక జరగనుండగా, రెండురోజుల ముందే ప్రచారానికి తెరపడనుంది. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ప్రచారానికి ముందే బ్రేక్ పడుతుంది… అయితే ప్రచారానికి బ్రేక్ పడ్డాక అసలు ఆట మొదలయ్యేలా కనిపిస్తోంది. ఆ తర్వాత నుంచి ఓటర్లని ఆకట్టుకునేదుకు పార్టీలు ఎన్ని ప్రయత్నాలు చేయాలో…అన్నీ ప్రయత్నాలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఓటర్లకు అనేక రూపాల్లో తాయిలాలు పంచారు…ఇక ఎన్నిక ముందు ఎన్ని రకాలుగా ఓటర్లని ప్రలోభ పెడతారో చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ తనదైన శైలిలో ఓటర్లని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అటు ఈటల రాజేందర్….ప్రజల మీద నమ్మకంతో ముందుకెళుతున్నారు.
అయితే ఈ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో పూర్తిగా క్లారిటీ మాత్రం రావడం లేదు…కొన్ని సందర్భాల్లో టీఆర్ఎస్ పైచేయి సాధించినట్లు కనిపిస్తోంది..కొన్ని సందర్భాల్లో ఈటలకు తిరుగులేదు అన్నట్లుగా పరిస్తితి ఉంటుంది. కానీ పూర్తిగా మాత్రం క్లారిటీ లేదు. కాకపోతే కొన్ని సెంటిమెంట్స్ ఈటలకు అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పార్టీ మారిన ఎమ్మెల్యేలు..తమ పదవులకు రాజీనామా చేయలేదు. కానీ ఈటల రాజీనామా చేసి..తన నిజాయితీని నిరూపించుకున్నారు. ఈ అంశం రాజకీయంగా ఈటలకు బాగా కలిసిరానుంది.
అదే సమయంలో టీఆర్ఎస్లో కీలకంగా పనిచేసిన నేతలు, ఆ పార్టీని వీడి బీజేపీలో సక్సెస్ అయ్యారు. అలా యెన్నెం శ్రీనివాసరెడ్డి, రఘునందన్ రావులు సక్సెస్ అయ్యారు. 2012లో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి ఆకస్మిక మరణంతో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ తరపున యెన్నెం బరిలో దిగి అనూహ్యంగా విజయం సాధించారు. ఇక దుబ్బాకలో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణంతో, ఆ స్థానానికి ఉపఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నికల్లో బీజేపీ తరుపున రఘునందన్ పోటీ చేసి సత్తా చాటారు. ఇప్పుడు ఈటల టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి, బీజేపీ తరుపున బరిలో దిగారు…ఇక ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే ఈటల గెలుపు కూడా ఖాయమే.