రేగా – వనమాకు షాక్ తప్పదా..!

-

ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని చెప్పొచ్చు..గతంలో ఇక్కడ టీడీపీకి కూడా అనుకూలమైన వాతావరణం ఉండేది. టీడీపీ తగ్గిపోయాక ఇక్కడ కాంగ్రెస్ బలం మరింత పెరిగింది. కానీ టీఆర్ఎస్ బలం మాత్రం పెద్దగా పెరగలేదు. గత రెండు ఎన్నికల్లో ఇతర జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది గాని ఖమ్మంలో మాత్రం సత్తా చాటలేకపోయింది.

గత ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 10 సీట్లలో టీఆర్ఎస్ ఒక సీటు గెలుచుకోగా, కాంగ్రెస్ 6, టీడీపీ 2, ఇండిపెండెంట్ ఒక చోట గెలిచారు. అయితే కాంగ్రెస్ 4, టీడీపీ 2, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లోకి వెళ్ళిపోయారు. దీంతో కాంగ్రెస్ కు ఇద్దరు ఎమ్మెల్యేలు మిగిలారు. అలా అని ఇక్కడ కాంగ్రెస్ బలం తగ్గిపోయిందని అనుకోవడానికి లేదు. ఇంకా అక్కడ కాంగ్రెస్ స్ట్రాంగ్‌గానే ఉంది. అలాగే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి వెళ్ళిన ఎమ్మెల్యేల పరిస్తితి కూడా అంతగా బాగోలేదని తెలుస్తోంది. అందులో ముఖ్యంగా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుల పరిస్తితి ఆశాజనకంగా లేదని తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీకి చెందిన రేగా..2009లో పినపాక ఎమ్మెల్యేగా గెలిచారు..ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయారు. కానీ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మరోసారి గెలిచారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. దీంతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్‌లోకి జంప్ కొట్టారు. అటు ఎన్నో ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో పనిచేసిన వనమా కూడా అదే పనిచేశారు. 2018లో కొత్తగూడెం నుంచి గెలిచిన వనమా తర్వాత టీఆర్ఎస్‌లోకి వెళ్లారు.

అయితే ఇలా జంప్ చేసిన ఈ ఇద్దరు ఎమ్మెల్యేల పరిస్తితి పెద్దగా బాగోలేదు. వీరిపై నెగిటివ్ పెరిగింది. పినపాకలో రేగా అక్రమాలు ఎక్కువయ్యాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇటు వనమాకు..తన తనయుడు రాఘవ చేసిన పనులే పెద్ద మైనస్. ఇలా టోటల్ గా చూసుకుంటే ఈ ఇద్దరికీ మైనస్ ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ వీరు గెలవడం పక్కన పెడితే..కనీసం సీటు దక్కుతుందో లేదో కూడా డౌటే.

Read more RELATED
Recommended to you

Latest news