ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీ జంపింగులు ఊహించని రీతిలో జరుగుతున్నాయి. అటు అధికార వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి..ఇటు టిడిపిలోకి కొత్తగా నేతలు వస్తున్నారు. ఇక జనసేనలోకి కూడా చేరికలు కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో తాజాగా కృష్ణా జిల్లా గన్నవరంలో ఊహించని మార్పు చోటు చేసుకుంది. అక్కడ వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు టిడిపిలోకి వస్తున్నారు.
ఇంతకాలం యార్లగడ్డ పార్టీ మారుతున్నారని ప్రచారం వస్తూనే ఉంది. కానీ ఆయన పార్టీ మారలేదు. ఇప్పుడు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నెలలోనే విజయవాడలో నారా లోకేష్ పాదయాత్ర జరగనుంది. దీంతో అప్పుడే యార్లగడ్డ టిడిపిలో చేరతారని తేలింది. తాజాగా యార్లగడ్డ..తన అనుచరులతో సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని..టిడిపిలోకి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలిసింది. అయితే అమెరికాలో పలు బిజినెస్‌లు చేసే యార్లగడ్డని 2019 ఎన్నికల ముందు వైసీపీలోకి తీసుకొచ్చారు. టిడిపిలో వంశీని ఓడించాలని గన్నవరం బరిలో నిలబెట్టారు.
ఆర్ధికంగా బలం ఉండటంతో యార్లగడ్డని అభ్యర్ధిగా దించారు. ఇక వంశీకి గట్టి పోటీ ఇచ్చారు. కానీ కేవలం వెయ్యి ఓట్ల తేడాతో వంశీ చేతిలో ఓడిపోయారు. నెక్స్ట్ వంశీ టిడిపిని వదిలి వైసీపీలోకి వచ్చారు. దీంతో యార్లగడ్డ, వంశీల మధ్య విభేదాలు మొదలయ్యాయాయి. జగన్ సర్దిచెప్పడానికి చూశారు..కానీ సెట్ కాలేదు.
ఈ క్రమంలోనే వైసీపీ సీటు వంశీకి ఫిక్స్ అయింది. అయినా గన్నవరంలోనే పోటీ చేస్తానని యార్లగడ్డ ప్రకటించారు. వైసీపీలో సీటు ఎలాగో దక్కదు. దీంతో ఆయన టిడిపిలోకి రావడానికి రెడీ అయ్యారు. వంశీ వెళ్ళాక గన్నవరంలో టిడిపికి దిక్కు లేదు. మధ్యలో బచ్చుల అర్జునుడుని ఇంచార్జ్‌గా పెట్టారు. ఆయన అనారోగ్యంతో మరణించారు. ఇక ఈ సీటు కోసం చాలామంది నేతలు రేసులోకి వచ్చారు. ఇప్పుడు యార్లగడ్డ టిడిపిలోకి రావడం తో..సీటు ఆయనకే దక్కుతుందని ప్రచారం ఉంది. దీంతో మళ్ళీ వంశీ, యార్లగడ్డ మధ్య ఫైట్ జరగనుంది. కానీ మాస్ ఫాలోయింగ్ గా ఉన్న వంశీకి చెక్ పెట్టడం అంత ఈజీ కాదు.